యూట్యూబ్ చానళ్లపై పూనమ్ కౌర్ ఫిర్యాదు..! పోలీసులు పట్టించుకుంటారా..?

సినీ నటి పూనంకౌర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసభ్యకరంగా వీడియోలు పెడుతున్నారని… యాభై యూ ట్యూబ్ చానల్స్‌పై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్‌లో తనపై అసభ్యంగా వీడియోలు పెడుతూ.. రెండేళ్లుగా మానసిక వేదనకు గురిచేస్తున్నారని పూనమ్‌కౌర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు 50 యూట్యూబ్‌ ఛానల్స్‌ను తన పై ఫిర్యాదు చేశానని తెలిపారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చర్యలు తీసుకుంటామన్నారని పూనమ్ మీడియాకు తెలిపారు. పూనమ్ ఫిర్యాదు వ్యవహారంపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పూనంకౌర్‌ను.. రాజకీయ నేతగా మారిన ఓ ప్రముఖ నటుడి అభిమానులు.. ఎక్కువగా.. సోషల్ మీడియాలో నిందిస్తూ ఉంటారు. ఈ సందర్భంగానే.. ఆమెపై… అనేక వీడియోలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ.. తన గౌరవాన్ని భంగం కలిగించి.. మానసికంగా ఇబ్బంది పెడుతూండటంతో.. చివరికి పోలీసుల్ని ఆశ్రయించారు.

గతంలో… సెలబ్రిటీల నుంచి ఇలాంటి ఫిర్యాదులు వస్తే.. పోలీసులు అఘమేఘాలపై స్పందించేవారు. వైఎస్ జగన్ సోదరి షర్మిల… ఇలాంటి ఫిర్యాదును కమిషనర్ కు ఇవ్వడం ఆలస్యం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. కానీ… అలాంటి వీడియోలను అప్ లోడ్ చేసిన వారిని అరెస్ట్ చేసినట్లుగా ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ.. అసభ్యంగా కామెంట్లు చేశారంటూ.. ఇద్దర్ని అరెస్ట్ చూపించారు. ఆ తర్వాత కూడా.. పలువురు తెలంగాణ పోలీసుల్ని ఆశ్రయించారు. సోమవారం.. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ… లక్ష్మిపార్వతి కూడా నేరుగా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును కమిషనరే సైబర్ క్రైమ్ కు పంపారు. ఇప్పుడు పూనంకౌర్ మాత్రం.. నేరుగా సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వీడియో లింకులు సహా.. ఆమె ఆధారాలు ఇచ్చారు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

పవన్ కల్యాణ్, కత్తి మహేష్ వివాదం చెలరేగినప్పుడు.. కత్తి మహేష్… ఈ వివాదంలోకి పూనమ్ కౌర్‌ను తీసుకొచ్చారు. అప్పట్నుంచి.. పూనమ్ కౌర్..రాజకీయంగా కూడా హాట్ టాపిక్ అయ్యారు. ఆమె స్టేట్‌మెంట్లు, ట్వీట్లు పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. ఆ తర్వాత కొంత కాలం సైలెంటయ్యారు. కానీ.. యూ ట్యూబ్ చానళ్లు మాత్రం ఆమెను వదిలి పెట్టలేదు. దాంతో.. ఆమె పోలీసుల్ని ఆశ్రయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close