లద్దాఖ్కు రాష్ట్ర హోదాతో పాటు ఆక్కడి యువత కోసం కొన్ని డిమాండ్లతో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు చనిపోయారు. వీటిని సీరియస్గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న సోనమ్ వాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసింది. ఆయనకు పాకిస్తాన్ లింకులు ఉన్నట్లుగా అక్కడి పోలీసులు ప్రకటించారు.
అయితే ఈ సోనమ్ వాంగ్ చుక్ ఎవరు అంటే.. ఆ పేరు లద్దాఖ్ వాసులకే ఎక్కువగా తెలుసేమో కానీ.. . దేశ ప్రజలందరికీ ఆయన గొప్పతనం పరోక్షంగా తెలుసు. విద్యా వ్యవస్థపై వచ్చిన అమీర్ ఖాన్ సినిమా త్రీ ఇడియన్స్ సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర పేరు వాంగ్డు. ఆ పాత్ర కు స్ఫూర్తి సోనమ్ వాంగ్చుక్. తొమ్మిదో ఏట వరకూ స్కూలుకు వెళ్లని వాంగ్ చుక్ ఆ తర్వాత అద్భుతాలు చేశారు. ఏం చేసినా లద్దాఖ్ యువత కోసమే చేశారు. అక్కడి యువత, ప్రజల బతుకుల్ని మార్చేందుకు చేశారు. ఓ వినూత్నమైన విద్యాసంస్థను నెలకొల్పారు.
ఆయనకు రామన్ మెగసెసె సహా చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డులు వచ్చాయి. ఇప్పుడు లద్దాఖ్ ఆందోళనల కారణంగా అరెస్టు అయ్యారు. ఆయనను రెండేళ్ల పాటు కోర్టులో ప్రవేశపెట్టుకుండానే జైల్లో ఉంచే అవకాశం ఉంది. కానీ ఆయనను అరెస్టు చేయడం వల్ల జెన్Z ఆందోళనలు తగ్గవన్న అభిప్రాయం ఉంది. అందుకే ఆయనను త్వరలోనే వదిలిపెడతారని చెబుతున్నారు. ఆయనకు పాక్ తో లింకులు ఉన్నాయో లేవో కానీ.. ఆయన మాత్రం అక్కడి యువతకు హీరోనే. ఆయన జర్నీ కూడా అందరికీ స్ఫూర్తిగా నిలిచేదే.