దేశంలో ఆంద్రప్రదేశ్ నెంబర్: 2: ప్రపంచ బ్యాంక్

ఒకప్పుడు దేశంలో బలమయిన రాష్ట్రాలలో ఒకటిగా, వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మంచి పేరు తెచ్చుకొన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత అన్ని విధాలా చితికిపోగా, తెలంగాణా రాష్ట్రం దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా ఉద్భవించింది. రాష్ట్ర విభజన తరువాత చాలా దయనీయమయిన పరిస్థితుల్లో ఉన్న ఆంద్రప్రదేశ్ చాలా క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ రాష్ట్రం ఎప్పటికయినా నిలద్రొక్కుకోగలదా? మున్ముందు పరిస్థితులు ఇంకా విషమిస్తాయా? అని సామాన్య ప్రజలు కూడా ఆందోళన చెందారు.కానీ కేవలం 14నెలల వ్యవధిలో రాష్ట్రంలో అనూహ్యమయిన మార్పులు కనబడుతున్నాయి. ఒకప్పుడు రాష్ట్ర భవిష్యత్ అగమ్యగోచరంగా కనిపిస్తే ఇప్పుడు చాలా ఆశావహంగా కనిపిస్తోంది.

రాజధాని నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులనన్నిటినీ ఒకటొకటిగా అధిగమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇంతవరకు ప్రత్యేక హోదా మంజూరు కాకపోయినా, రాజధాని లేకపోయినా, ఆర్ధిక పరిస్థితులు బాగోలేకపోయినా రాష్ట్రానికి చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు తరలి వస్తున్నాయి. ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రంలో ఐ.ఐ.ఎం., ఐ.ఐ.టి., ఐ.ఐ.ఐ.టి. వంటి ఐదు ఉన్నత విద్యాసంస్థలకు శంఖు స్థాపనలు చేయబడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో మొక్కుబడిగా శంఖు స్థాపనలు చేసి చేతులు దులుపుకోకుండా తాత్కాలిక భవంతులలో అప్పుడే శిక్షణా తరగతులు కూడా మొదలుపెట్టేశాయి. అది వాటి చిత్తశుద్ధికి చక్కటి ఉదాహారణ. ఇక మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్థిరంగా అడుగులు ముందుకే వేస్తోంది. ఎన్ని సవాళ్లు సమస్యలు ఎదురవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య నెలకొని ఉన్న చక్కటి బలమయిన బంధం కారణంగా రాష్ట్రంలో ఇంకా అనేక ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలవుతున్నాయి. ఈ కారణంగానే రాష్ట్ర పరిస్థితుల్లో చాలా సానుకూలమయిన మార్పులు కనబడుతున్నాయి. అనేక సమస్యలు, విమర్శలు ఎదురవుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంతో చక్కటి స్నేహ సంబంధాలు కొనసాగిస్తుండటం వలననే ఇది సాధ్యం అయ్యిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనుక ఈ క్రెడిట్ ఖచ్చితంగా ఆయనకే చెందుతుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలలో భవిష్యత్ పట్ల నమ్మకం, ఆత్మవిశ్వాసం నెలకొల్పగలిగారు. అదేవిధంగా ఆయన పట్ల ప్రజలలో కూడా పూర్తి నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, ప్రభుత్వం ఒకరిపై మరొకరు ఇటువంటి పరస్పర నమ్మకం, విశ్వాసం కలిగి ఉండటం చాలా గొప్ప విషయం. సాధారణంగా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకొన్నప్పుడు ఏర్పడే ఆందోళన, గందరగోళం కారణంగా పరిస్థితులు ఇంకా విషమిస్తుంటాయి. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అందుకు పూర్తి భిన్నంగా ప్రభుత్వంలో, ప్రజలలో చాలా ఆత్మవిశ్వాసం, పరస్పర నమ్మకం, ఉజ్వల భవిష్యత్ ఉందనే నమ్మకం కనబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలు ఎంతో విజ్ఞత కనబరుస్తూ సరయిన నిర్ణయం తీసుకొన్నందునే ఇది సాధ్యమయిందని చెప్పవచ్చును. అదే విధంగా ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలుపుకొన్నారు. సమస్యలని చూసి బెదిరిపోకుండా వాటిని సవాలుగా స్వీకరించి ఎదురొడ్డి పోరాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రజలని కూడా అభినందించవలసిందే.

ఇటువంటి పరిస్థితుల్లో చాలా వేగంగా రాష్ట్రాభివృద్ధి జరిగేందుకు కేంద్రప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం వలన మళ్ళీ రాష్ట్రం త్వరలోనే తన కాళ్ళ మీద తాను నిలబడగలదనే నమ్మకం ఇప్పుడు అందరిలోను కలుగుతోంది. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇటువంటి సానుకూల వాతావరణం కనబడుతున్నందునే దేశంలో గుజరాత్ తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రం వ్యాపారానికి అత్యంత అనువయిన రాష్ట్రమని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది.

ఇంతటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఒక రాష్ట్రానికి ప్రపంచ బ్యాంక్ ఈ విధమయిన గుర్తింపును ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయమే. దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణా రాష్ట్రానికి ఈ విషయంలో 13వ స్థానం ఇవ్వడం ఇంకా ఆశ్చర్యకరం. ఇంతకాలం ఎన్నడూ దేనికీ గుర్తింపుకి నోచుకోని జార్ఖండ్ రాష్ట్రం వ్యాపారానికి అనువయిన రాష్ట్రాలలో 3వ స్థానానికి ఎదగడం చాలా హర్షణీయం.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ఈ చిన్న గుర్తింపు ఎంతో మేలు చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చును. దేశ విదేశాల నుండి పరిశ్రమలు, పెట్టుబడులు భారీగా రప్పించేందుకు ఈ ర్యాంకింగ్ చాలా సహాయపడుతుంది. ప్రత్యేక హోదా లేకపోయినా ఇప్పటికే అనేక చిన్నా పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ఈ ర్యాంకింగ్ కారణంగా పెట్టుబడుల ప్రవాహం ఇంకా పెరగవచ్చును. కేవలం ఏడాదిన్నర సమయంలోనే రాష్ట్రంలో చాలా సానుకూలమయిన వాతావరణం ఏర్పడింది. దానిని ప్రపంచ బ్యాంక్ కూడా గుర్తించింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధి కోసం తమవంతు సహాయ సహకారాలు అందించకపోయినా పరువాలేదు. కానీ ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో ఏదో ఒక సాకుతో నిత్యం బందులు, ధర్నాలు అంటూ రాష్ట్రంలో మళ్ళీ అల్లకల్లోల పరిస్థితులను సృష్టిస్తే, దాని వలన అభివృద్ధి మందగిస్తే వారిని ప్రజలు కూడా క్షమించరని గుర్తుంచుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close