జగన్ రికార్డ్..! ఐదుగురు డిప్యూటీ సీఎంలు..!?

డిప్యూటీ సీఎం అంటే.. ఒకరుంటారు. …లేకపోతే ఇద్దరుంటారు. దేశంలో ఉత్తరప్రదేశ్ లాంటి అతి పెద్ద రాష్ట్రంలోనూ… ఇలాగే జరిగింది. ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్న చరిత్ర గతంలో లేదు. ఇప్పుడు.. ఆ చరిత్రను జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్నారు. ఏకంగా తన కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలకు చాన్స్ ఇస్తున్నారు. ఐదు కీలకమైన సామాజికవర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీల నుంచి.. ఈ డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నారు. ఈ విషయంలో… వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ .. నేరుగా ఎమ్మెల్యేలుకే చెప్పారు.

మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఎవరెవరికి మంత్రి పదవులు లభించబోతున్నాయో. .. అధికారికంగా చెప్పలేదు కానీ.. కొన్ని సూచనల ద్వారా.. ఆయా ఎమ్మెల్యేలకు… సమాచారం అందిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం అధికారికంగా మంత్రుల గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. రేసులో ఉన్న వాళ్ల కంటే.. చాలా కొత్త పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తిరుగులేని మెజార్టీ ఉన్నందున.. ఎక్కువ సీనియర్లకు కాకుండా… యువ నేతలకు చాన్సిచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. స్పీకర్‌గా తమ్మినేని సీతారాం పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు.

ఐతే.. పేరుకే డిప్యూటీ సీఎం .. ప్రభుత్వం హోదా కల్పిస్తే.. ప్రొటోకాల్ ప్రకారం… కొన్ని అధిక గౌరవ మర్యాదలు దక్కుతాయి. అంతే కానీ.. ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం వ్యవస్థ లేదు. ఎంత కీలక శాఖలు కేటాయిస్తారన్నదానిపైనే…వారికి ప్రాధాన్య ఆధారపడి ఉంటుంది. టీడీపీ హయాంలో… బీసీ సామాజికవర్గం నుంచి.. కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా కీలకమైన రెవిన్యూ శాఖను నిర్వహించారు. అలాగే.. నిమ్మకాయల చినరాజప్ప.. డిప్యూటీ సీఎంగా.. హోంశాఖను.. నిర్వహించారు. వారికి శాఖల ద్వారా ప్రాధాన్యం లభించింది కానీ.. డిప్యూటీ సీఎంగా కాదు. అయితే. వర్గాలందరికీ చాన్సిచ్చినట్లుగా.. చెప్పుకోవడానికి ఐదు డిప్యూటీ సీఎం పోస్టులు ఉపయోగపడతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close