అమరావతిని ఐదు సంవత్సరాలపాటు నాశనం చేసి చెప్పిన మాటలే ఇప్పుడూ జగన్ రెడ్డి చెబుతున్నాయి. సొంత రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి తాను పాతాళంలోకి పడిపోయినా సిగ్గు తెచ్చుకోలేదు. అమరావతికి చట్టబద్ధత వస్తూంటే.. అదే రోజు ప్రెస్మీట్ పెట్టి తప్పుడు ప్రచారాలు గంటల తరబడి చేశారు. ఇందులో కొత్త విషయాలు ఏమైనా చెప్పారా అంటే.. ఎప్పటి నుండో చెబుతున్న ఖర్చు గురించి చెబుతున్నారు.
అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు కావాలని ఎక్కడి నుంచి వస్తాయని.. అప్పులు చేస్తున్నారని ఇతర ప్రాంతాలు ఏం కావాలని అంటున్నారు. అమరావతికి ఇప్పటి వరకూ 48వేల కోట్లు అప్పు చేశారని కూడా చెప్పారు. ఆ అప్పులు ఒకే సారి రావు. నిర్మాణం అవుతున్నకొద్దీ వస్తాయి. ఆ అప్పుల్ని అమరావతి భూముల్ని అమ్మడం ద్వారా తీరుస్తారు.. అందులో ప్రపంచబ్యాంక్ అప్పులు కేంద్రం కడుతుంది. ఇవన్నీ జగన్ రెడ్డికి తెలియక కాదు. తెలిసినా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి, తనను నమ్మేవాళ్లను పిచ్చి వాళ్లను చేయడానికి ఆయన వాడే రాజకీయం
గంటల తరబడి మాట్లాడిన ఆయన తాము వస్తే అమరావతిలోనే రాజధాని ఉంచుతామని మాత్రం చెప్పలేదు. పదే పదే వ్యతిరేకం కాదంటారు. వ్యతిరేకం కాదన్నదానికి ఇంత విషం చిమ్మడం ఎందుకు.. అదంతా వ్యతిరేకం కాదా అంటే… అక్కడే వైసీపీ రాజకీయం ఉంటుంది. జగన్ మార్క్ కుట్రలు ఉంటాయి. అమరావతికి రైతులు ఇచ్చిన భూములతో రాజకీయం చేశారు. రైతుల్ని రోడ్డున పడేశారు. ఐదు సంవత్సరాల్లో కౌలు కూడా సరిగ్గా ఇవ్వలేదు. తాను మళ్లీ రాకపోయినా అమరావతి ఇక ఎప్పటికీ పట్టాలెక్కదు అనుకున్నంతగా నాశనం చేశారు. కానీ ఇప్పుడు అన్నీ పనులు మళ్లీ ప్రారంభమై..పరుగులు పెడుతూంటే.. కొత్తగా అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్నారు.
జగన్ రెడ్డి ప్రెస్మీట్ లో ఏం చెప్పినా దానికి ప్రాతిపదిక ఉండదు. అన్నీ అబద్దాలు, అవాస్తవాలు ఉంటాయి. నిజం అందరికీ తెలిసినా ఆయన అబద్దాలే చెబుతారు. ఎందుకంటే.. తనను నమ్మే వాళ్లను ఆయన గొర్రెలుగా చూస్తారు. తాను చెప్పిందే నమ్ముతారని అనుకుంటారు. మొదటి దశలో అమరావతిపై ఎన్నో ఆరోపణలు కుట్రలు చేశారు. జగన్ సీఎం అయిన ఐదేళ్లలో ఒక్కటీ నిరూపించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ అవే చేస్తున్నారు. జగన్ రెడ్డి ఒక్క సారి కూడా అధికారంలో లేనప్పుడు.. ఆయన మాటల్ని నమ్మారేమో కానీ.. ఓ సారి చాన్స్ ఇచ్చి చూసి ఆయన పని తనం.. నిజాయితీ చూశాక.. ఇంకెవరూ నమ్మే చాన్స్ ఉండదు. ఆ విషయం మాత్రం ఆయనకు అర్థం కావడం లేదు.
