కరెంట్ ఫెయిల్యూర్..! టీడీపీనే కారమణంటున్న వైసీపీ..!

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. దీనికి కారణం ఎవరు..? అంటే.. తెలుగుదేశం పార్టీ వైపే చూపిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు … విద్యుత్ కంపెనీలకు బిల్లులు కట్ట కుండా వెళ్లారని.. అందుకే.. ఆయా విద్యుత్ కంపెనీలు.. విద్యుత్ నిలిపివేశాయని చెబుతున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గర నుంచి ప్రతీ ఒక్కరూ ఆదే మాట కోరస్‌లో వినిపిస్తున్నారు. ఒప్పందాలు చేసుకున్న ఏ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకైనా.. బిల్లులు పద్దతి ప్రకారం కట్టకపోతే.. సరఫరా నిలిపివేస్తాయి. దానికో వ్యవస్థ ఉంటుంది. ఆ విషయం సామాన్యులకు తెలియదు కాబట్టి.. టీడీపీపై నిందలేస్తే.. సరిపోతుందని అనుకుంటున్నట్లుగా ఉన్నారు వైసీపీ నేతలు.

గత ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉత్పత్తి 5 వేల మెగావాట్లపైనే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 29న ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉత్పత్తి 3 వేల మెగావాట్లకు కొంచెం ఎక్కువగా ఉంది. ఎలా లేదన్నా.. దాదాపుగా రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లోటు కనబడుతోంది. ఉత్పత్తి ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం ఎవరు..? పరిస్థితులకు అనుగుణంగా… ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోయారు..? బొగ్గు కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలిసినా.. ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదో మాత్రం.. ప్రభుత్వం రివ్యూ చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ విషయంలో పీపీఏలు కూడా దెబ్బకొట్టాయి. ఆయా కంపెనీలకు నిధులు ఇవ్వకపోవడంతో.. కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. దాంతో కేంద్రం ఏ విద్యుత్ కంపెనీ .. ఏపీకి కరెంట్ అమ్మకుండా నిషేధించింది.

వాస్తవాలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూండగా.. వైసీపీ మాత్రం.. నిర్మోహమాటంగా.. ప్రతిపక్షంగా నెట్టేసి… తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంత వరకూ సమస్య పరిష్కారం కోసం.. విద్యుత్ మంత్రి ఒక్క రివ్యూ కూడా చేయలేదు. పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నట్లుగా ప్రభుత్వం కనిపించలేదు. కానీ రాజకీయం మాత్రం ప్రారంభించేసింది. ఇసుక కొరత, కరెంట్ కోతల్లాంటివి… ప్రజల రోజువారీ జీవితాలపై ప్రభావం చూపే అంశాలు. వీటి విషయంలో సర్కార్ శరవేగంగా స్పందించకపోతే… ప్రజావ్యతిరేకత పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రతిపక్షంపై నిందలు రాజకీయానికి పనికి వస్తుంది కానీ… బాధ్యత ఉన్నది అధికారపక్షం మీదేనని ప్రజలు కూడా నమ్ముతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close