వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడటం లేదు. ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. మెడికల్ కాలేజీల పేరుతో చేసిన డ్రామాలు రివర్స్ అయ్యాయి. ప్రజా సమస్యల్ని ఎత్తుకుని ప్రజల్లోకి వెళ్లడానికి ధైర్యం చాలడంలేదు. కార్యకర్తలతో సమావేశాలకూ జగన్ ఆసక్తి చూపించడం లేదు. అసలు ఆయన పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తూ బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. ఏమైనా ప్లాన్ చేసిన.. పూర్తిగా డ్రామా ఆర్టిస్టుల మాదిరిగా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. చూసే వారికి ఇదంతా కామెడీ అనిపిస్తోంది కానీ రాజకీయం అనిపించడం లేదు. ఏ మార్పు రానప్పుడు..కొత్తగా వైసీపీ ప్రయత్నించేందుకు కృషి చేయాల్సింది.కానీ ఆ డ్రామాల బావి నుంచి బయటకు రావడం లేదు.
బర్త్ డే విషెస్ కోసమూ సెటప్పులా.. ?
జగన్ రెడ్డి తాడేపల్లి నుంచి బెంగళూరు పోతూంటే ఆయన పుట్టిన రోజు అని ఓ చిన్న బిడ్డతో బోకే ఇప్పించే సెటప్ ఏర్పాటు చేసి వీడియోలు తీసి.. ఆహా జగనన్న క్రేజ్ అని చెప్పుకున్నారు. అసలు ప్రయాణికుల లిస్ట్ ముందస్తుగా ఎవరికైనా తెలుస్తుందా?. ఇలాంటి సెటప్పులు ఏర్పాటు చేసుకుని పరువు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయంగా ఆయన ఎక్కడికెళ్లినా తొక్కిసలాట జరిగిపోవాల్సిందేన్నట్లుగా ఎలాంటి కార్యక్రమాన్ని అయినా వారం రోజుల ముందుగా ప్లాన్ చేసుకుని పెయిడ్ జనాలను తెచ్చుకోవడం.. వారితో డ్రామాలు వేయించడం.. మోకాళ్ల దండాలు పెట్టించుకోవడం చూసి జనాలు పాపం అనుకుంటున్నారు. జగన్ రెడ్డి వేసే ప్రతి స్కిట్ గురించి ఇప్పుడు తెలిసిపోయింది.
డ్రామా రాజకీయాలకు కాలం చెల్లింది !
డ్రామా రాజకీయాలకు కాలం చెల్లింది. ఇది జెన్ జీ కాలం . వారు రాజకీయాలను డ్రామాలుగా చూడాలనుకోవడం లేదు. ఆర్గానిక్ గా ఉండాలని కోరుకుంటున్నారు. డ్రామాలేస్తే.. అవి రాజకీయాలు అనుకోవడం లేదు. పెద్దల్లో కూడా మార్పులు వచ్చాయి. ఇలాంటి సమయంలో స్క్రిప్టెడ్ రాజకీయాలు అందరికీ అర్థమయిపోతున్నాయి. వైసీపీకి ఈ ఫీడ్ బ్యాక్ అందతూనే ఉంటుంది. కానీ వారు తమను తాము మార్చుకోవాలనుకోవడం లేదు. అందుకే ప్రజలు కూడా వీరి రాజకీయాలు అంతే అని లైట్ తీసుకున్నారు.
ఆర్గానిక్ ప్రయత్నం ఓ ఏడాది చేసి చూస్తే చాలు !
మార్పు ఎప్పుడూ మంచికే. వైసీపీ ఈ డ్రామాలన్నింటినీ పక్కన పెట్టి ఆర్గానిక్ గా సహజమైన రాజకీయాలను ఓ ఏడాది పాటు చేస్తే.. ప్రజా నాడి ఏమిటో తెలుస్తుంది. జగన్ రెడ్డి ఫలానా చోటకు వస్తున్నాడని జనాన్ని తరలించి మోకాళ్ల దండాలు పెట్టించకుండా.. చూసుకుంటే నిజంగా ఆయన కోసం ఎంత మంది వస్తున్నారో వారికి క్లారిటీ వస్తుంది. వైసీపీలో ఎంత మంది నేతలు చురుకుగా ఉన్నారో అర్థమవుతుంది. నిజంగా బాధితుల్ని పరామర్శించి సాయం చేస్తే.. వచ్చే మైలేజీ వేరుగా ఉంటుంది. అలా అయితే జగన్ రెడ్డికి ప్రజాదరణ లేదని ప్రచారం చేస్తారన్న భయం ఉంటుంది. కానీ మొదట్లో అలాగే ఉంటుంది కానీ రాను రాను ఆర్గానిక్ రాజకీయం వల్ల జరిగే మేలుతో అదంతా పాతబడిపోతుంది. వైసీపీకి ప్రస్తుతం స్ట్రాటజిస్టులు ఉన్నారో లేదో కానీ .. ప్రశాంత్ కిషోర్ ను మించిన డ్రామాలు ప్లాన్ చేస్తున్నారు కానీ.. ఆర్గానిక్ ప్రయత్నాలు చేయనివ్వడం లేదు. అందుకే వైసీపీ డ్రామాల పార్టీగానే మిగిలిపోతోంది.
