Live Blog – Telangana Assembly Elections 2018

0

Telangana Assembly Elections 2018 Live Updates

17:20 కేసీఆర్ నాయ‌క‌త్వాన్ని ప్ర‌జ‌లు అంగీక‌రించ‌డం లేద‌నేది స్ప‌ష్ట‌మౌతుంద‌న్నారు పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. ఓటింగ్ జ‌రిగిన విధానం విశ్లేషిస్తే అది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్నారు. ప్ర‌జా కూట‌మికి 80 నుంచి 85 సీట్లు రావ‌డం చాలా స్ప‌ష్టం అన్నారు. తెలంగాణ‌లో త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

16:30
ఉద‌యం 7 గంట‌ల నుంచే పోలింగ్ కేంద్రాల ద‌గ్గ‌ర ప్ర‌జ‌లు బారులు తీరారు. కానీ, చాలాచోట్ల ఈవీఎమ్ లు మొరాయించ‌డంతో దాదాపు ఓ గంట ఆల‌స్యంగా ఓటింగ్ ప్రారంభ‌మైన ప్రాంతాలు ఉన్నాయి. మ‌ధ్యాహ్నం భోజ‌న స‌మ‌యం వ‌ర‌కూ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ బాగానే సాగింది. కానీ, మ‌ధ్యాహ్నం త‌రువాత మంద‌గించింది. ఉదయం పరిస్థితి చూస్తే పెద్ద మొత్తంలో ఓట్లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంద‌రూ భావించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ భారీగానే ఉన్నా, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు వ‌చ్చేస‌రికి న‌మోదు శాతం త‌గ్గింది. హైద‌రాబాద్ లో 53 శాతం మాత్ర‌మే పోలింగ్ న‌మోదైంది.

16:00
తెలంగాణ‌లో ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌లు. సాయంత్రం 4.గం. 45 ని. వ‌ర‌కూ 68.5 శాతంగా పోలింగ్ న‌మోదైంది. అయితే, ఇంకా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొన‌సాగుతోంది.

15:22 బావ హ‌రీష్ రావుకి కంగ్రాట్స్ చెప్పారు కేటీఆర్‌. సిద్ధిపేట నియోజ‌క వ‌ర్గంలో పోలింగ్ స‌ర‌ళిని హ‌రీష్ రావు ప‌రిశీలించారు. ఈ క్ర‌మంలో కొన్ని గ్రామాల్లో ఆయ‌న ప‌ర్య‌టించారు. హైద‌రాబాద్ నుంచి సిరిసిల్ల వెళ్తున్న కేటీఆర్‌, గుర్రాలగొంది ద‌గ్గ‌ర బావ హ‌రీష్ రావుకి ఎదురుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రూ ఆత్మీయంగా ప‌ల‌క‌రించి మాట్లాడుకున్నారు. ‘బావా కంగ్రాట్స్‌… ల‌క్ష మెజారిటీ ఖాయం. నీ మెజారిటీలో స‌గ‌మైనా తెచ్చుకుంటా’ అంటూ హ‌రీష్ తో కేటీఆర్ చెప్పారు.

14:30 నిజామాబాద్ ఎమ్మార్వో కార్యాల‌యం ఎదుట కొంత‌మంది ప్ర‌జ‌లు ధ‌ర్నాకి దిగారు. త‌మ పేర్లు గ‌ల్లంతు అయ్యాయ‌నీ, ఓటు వేసే అవ‌కాశం క‌ల్పిస్తే త‌ప్ప ఇక్క‌డి నుంచి క‌దిలే ప‌రిస్థితి లేదంటున్నారు. ఓట‌రు ఐడీ ఉండి కూడా ఓటెయ్య‌క‌పోతే తాము బ‌తికి లేన‌ట్టే అంటూ కొంద‌రు ఓట‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జాబితాలో పేర్లు లేని త‌మ‌కు ప్ర‌త్యేకంగా పోలింగ్ ఏర్పాటు చేసి, హ‌క్కు వినియోగించుకునే అవ‌కాశం క‌ల్పించాలంటూ ఆందోళ‌న చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంట‌నే స్పందించాలంటున్నారు.

14:16 రాష్ట్రవ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కూ 48.33 శాతం పోలింగ్ న‌మోదు అయింది. ఉద‌యం మంద‌కొడిగా ఓటింగ్ మొద‌లైనా, మ‌ధ్యాహ్నం నుంచి ఊపందుకుంది. సాయంత్రం ఐదు వ‌ర‌కూ ఓటింగ్ ప్ర‌క్రియ జ‌రుగుతుంది.

అర్బ‌న్ ప్రాంతాల్లో 60 నుంచి 70 శాతం పోలింగ్ మించ‌డం లేద‌నీ, గ్రామీణ ప్రాంతాల‌తో స‌మానంగా అర్బ‌న్ ఓట‌ర్లు కూడా ఓటెయ్యాల‌ని కోరారు కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. ప‌ట్ట‌ణాల్లో ఉన్న విజ్ఞులైన ప్ర‌జ‌లంతా ముందుకు రావాల‌న్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మేథావులంతా ఓటింగ్ లో పాల్గొనాల‌న్నారు.

14:00 త‌న జీవితంలో తొలిసారిగా ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్‌. బి.ఆర్. అంబేద్క‌ర్ ఫొటో ప‌ట్టుకుని ఆయ‌న ఓటెయ్య‌డానికి వ‌చ్చారు. 70 ఏళ్ల గ‌ద్ద‌ర్ ఇంత‌వ‌ర‌కూ ఏ ఎన్నిక‌ల్లోనూ ఓటు వెయ్య‌లేదు. బ్యాంకు ఉద్యోగిగా కొద్దిరోజులు ప‌నిచేసి, ఆ త‌రువాత మావోయిస్టు పార్టీలో చేరిన గ‌ద్ద‌ర్‌.. తాజా ఎన్నిక‌ల్లో కూట‌మి త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే.

12:43 Superstar Mahesh Babu and actor Rana utilized voting right

CM KCR voted and hoped their party will have better prospects

MP Kavitha utilized voting right at Nizamabad

Voters turn up in huge numbers at Kodangal. Expected to cross last time voting percentage this time at Kodangal

Vijayashanti utilized vote in Hydeabad and asked people to vote for a good party

11:31 Shock to Gutta Jwala as her name not found in voter list. She left the polling booth with disappointment

Manchu Lakshmi voted. Called everyone to utilize voting right.

11:30 Shock to Raghavendra Rao. Voters took objection at him as he tried to vote without standing in the long queue. He left the booth without voting

11:26 Super star Krishna, Vijay Nirmala and Naresh cast their vote
Called everyone to vote

11:24 కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తల దాడి. అమనగల్ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ వద్ద ఇరు పార్టీల మధ్య రగడ జరిగింది. ఈ సమాచారం తెలిసి కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అక్కడకు చేరుకోగా ఆయనపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడంతో గాయాలయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిని ఖండించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

11:13 By 11 am, voting percentage is 21.7%

09:50 మా అక్క గెల‌వాల‌ని కోరుకుంటున్నా అన్నారు ఎన్టీఆర్‌. రాజ్యాంగం మ‌న‌కు క‌ల్పించిన హ‌క్కు ఓటు అనీ, అంద‌రూ వినియోగించుకోవాల‌న్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్‌. ఓటు వినియోగించుకోక‌పోతే… ఫిర్యాదు చేసే హ‌క్కు లేద‌న్నారు.

09:40

ఇంట్లో కూర్చుని టీవీ చూడ్డానికీ, ప‌క్కింట్లో టైమ్ పాస్ చెయ్య‌డానికి సెల‌వు ఇవ్వ‌లేద‌నీ, ప్ర‌జ‌లంతా ద‌య‌చేసి ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌న్నారు ఎమ్‌.ఐ.ఎమ్‌. నేత అక్బ‌రుద్దీన్ ఒవైసీ. ఓటు వెయ్య‌కుండా నాయ‌కుల్ని విమ‌ర్శించే హ‌క్కు ఎవ‌రికీ ఉండ‌ద‌న్నారు. త‌మ‌కు అన్ని చోట్ల నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తోంద‌న్నారు. ఐదేళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే ఓటేసే అవ‌కాశాన్ని అంద‌రూ వినియోగించుకున్నారు. జుమా ఉందీ, ఇవాళ్ల అమావాస్య ఉందీ… అయినా అంద‌రూ ఓటెయ్యాల‌న్నారు.

09:35

Nandamuri Suhasini utilized voting right at Mehdipatnam polling booth.

NTR and his family in queue line and fans trying to shake hand with him. Selfies not allowed at polling booth as per EC rules

09:24

రాష్ట్రవ్యాప్తంగా ఇప్ప‌టికీ 229 కేంద్రాల్లో మొరాయిస్తున్న ఈవీఎమ్ లు. పోలింగ్ ప్ర‌క్రియ స‌క్ర‌మంగా ముందుకు సాగని ప‌రిస్థితి. 20 కేంద్రాల్లో ఇప్ప‌టికీ ఓటింగ్ ప్రారంభ‌మే కాలేదు. వేసిన ఓటును ఎనిమిది సెకెన్ల‌పాటు వీవీ ప్యాట్ లో డిస్ప్లే కావాల్సి ఉంది. కానీ, చాలాచోట్ల నిమిషాల కొద్దీ ఆల‌స్యం జ‌రుగుతూ ఉండ‌టంతో… క్యూలైన్ల‌లో ఉన్న ఓటర్లు కొంత అసంతృప్తికి గురౌతున్నారు.

09:20

09:16

9.37% voting polled by 9 am across Telangana

09:16

Posani complains: Posani utilized vote this morning in Hyderabad. However, he told, there is no light in the room and so it was difficult to identify election symbols in EVMs.

09:15

PV Sindhu and Pullela Gopichand utilized their voting right. Gopichand showed his inked finger to media and Sindhu showed her voter card to media.

09:13

ప్ర‌జాకూట‌మిని ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నారు అన్నారు నామా నాగేశ్వ‌ర‌రావు. ఏ బూత్ కి వెళ్లినా త‌మ‌ను ఆశీర్వ‌దిస్తున్న స్పంద‌న క‌నిపిస్తోంద‌న్నారు. సాధించుకున్న తెలంగాణ‌లో గ‌డ‌చిన నాలుగున్న‌రేళ్లుగా ప్ర‌జ‌లు ఇబ్బందులు పాల‌య్యార‌నీ, అందుకనే ప్ర‌జా కూట‌మి గాలి రాష్ట్రవ్యాప్తంగా బలంగా వీస్తోంద‌నీ, కూటమి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు. ఖ‌మ్మం జిల్లాలో అన్ని స్థానాలు తాము గెలుస్తామ‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

09:10

గ‌వ‌ర్న‌ర్ న‌ర్సింహ‌న్ దంప‌తులు ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అనంత‌రం మీడియాతో గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ… ఈరోజు అంద‌రి బాధ్య‌త ఓటు వేయ‌డ‌మ‌నీ, మ‌రో మూడు రోజులు సెల‌వులు ఉన్నాయి కాబ‌ట్టి.. ఇవాళ్ల ఒక్క గంట ఇక్క‌డికి రండి అన్నారు.

09:00

08:50

You have no right to complaint if you don’t vote : Nagarjuna

Akkineni Nagarjuna and his wife Amala use their voting right this morning at a polling both in jubilee hills. After requesting court he spoke to media and called people to utilize their voting right.

After casting vote, Nagarjuna spoke to media. He told, ” This is the time to vote for our leaders and this is the day of voters. It is very irresponsible if one doesn’t come and vote. It is also not correct on the part of some youngsters who say, we don’t believe in politics and we don’t want to vote. If you don’t vote you will not have any right to complain. You should come out and vote.

Also director Rajamauli and Allu Arjun utilized their vote this morning.

08:40

తెలంగాణ వ్యాప్తంగా తొలి గంటలో దాదాపుగా ఏడు శాతం పోలింగ్ నమోదు, తొలి గంటలోనే ఓటేసిన పలువురు ప్రముఖులు

ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి, నాగార్జున , కీరవాణి

పలు చోట్ల ఈవీఎంలలలో సాంకేతిక సమస్యలు , ఎప్పటికప్పుడు సరి చేస్తున్న సాంకేతిక సిబ్బంది, ప్రతి పోలింగ్ బూత్‌లోనూ వెబ్ కాస్టింగ్

08:00

Allu Arjun at polling center to cast his vote.

— https://twitter.com/isudheerbabu/status/1070705802585899008

Polling began in Telangana at 7 a.m. on Friday amid tight security to elect a new Assembly.

The polling will be held from 7 a.m. to 5 p.m. in 106 constituencies, while in 13 Left Wing Extremism (LWE) affected constituencies, the polling will conclude at 4 p.m.

Around 2.8 crore voters will decide the fate of 1,821 candidates in the first election after Telangana was formed.

The ruling Telangana Rashtra Samithi (TRS) is facing a resurgent Congress-led People’s Front in its bid for a second term.

The TRS government dissolved the Assembly about eight months ahead of the schedule in the hope of taking the Opposition parties by surprise but the Congress threw a surprise by coming up with an alliance in a bid to oust the ruling party.

For the 119-member Telangana assembly where the Congress has tied up with rivals TDP, CPI and Telangana Jana Samithi (TJS), a new party floated by M. Kodandaram, who was once Chief Minister K. Chandrasekhar Rao’s friend in the Telangana movement.

Telangana has 51,796 polling stations, an increase of 14.25 per cent over the previous election in 2013.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here