పాతికేళ్ల‌ నిన్నే పెళ్లాడ‌తా: 3 నిమిషాల్లో క‌థ ఓకే.. 15 రోజుల్లో స్క్రిప్టు రెడీ!

నాగార్జున కెరీర్‌లో ఓ మ‌ర్చిపోలేని సినిమా… నిన్నే పెళ్లాడ‌తా. తెలుగులో ఆ సినిమా ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌. కృష్ణ‌వంశీ మాయాజాలాన్ని 70 ఎం.ఎంలో చూపించిన సినిమా అది. కుటుంబ ప్రేక్ష‌కుల‌కు బాగా నచ్చింది. కుర్రాళ్లైతే.. ట‌బు కోసం థియేట‌ర్ల ముందు క్యూ క‌ట్టారు. పాట‌లంటారా? సూప‌ర్ డూప‌ర్ హిట్. ఇప్పుడు స‌డ‌న్ గా నిన్నే పెళ్లాడ‌తా టాపిక్ ఎందుకంటే, ఈ సినిమా విడుద‌లై నేటికి స‌రిగ్గా పాతికేళ్లు.

కృష్ణ‌వంశీ తొలి సినిమా గులాబీ. ద‌ర్శ‌కుడిగా త‌న‌కు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. దాంతో పాటు ఆఫర్లు కూడా. ఆ వెంట‌నే నాగార్జున పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చాడు. నాగ్ కోసం ఓ క‌థ రెడీ చేయ‌డం, దానికి నాగ్ ఓకే అన‌డం కూడా జ‌రిగిపోయాయి. లొకేష‌న్ల రిక్కీ కోసం కృష్ణ‌వంశీ వైజాగ్ వెళ్లాడు. అయితే అక్క‌డ గులాబీ గురించిన కొంత ఫీడ్ బ్యాక్ సంపాదించాడు కృష్ణ‌వంశీ. `సినిమా బాగానే ఉంది.. కానీ సెకండాఫ్‌లో హింస ఎక్కువైంది` అని కొంద‌రంటే, `మీ గురువు రాంగోపాల్ వ‌ర్మ‌లా తీశావ్` అని మ‌రికొంద‌రు ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఇవి రెండూ కృష్ణ‌వంశీకి న‌చ్చ‌లేదు. `రాంగోపాల్ వ‌ర్మ‌లా కాదు… నన్ను కృష్ణవంశీలానే చూడాలి` అని ఫిక్స‌య్యాడు కృష్ణ‌వంశీ. అందుకే రామూ ట‌చ్ చేయ‌ని జోన‌ర్ ని ట‌చ్ చేసి, హిట్టు కొట్టాల‌నిపించింది. తాను రాసుకున్న క‌థ మ‌ళ్లీ.. రామూ ఫార్మెట్ లోనే ఉండ‌డంతో దాన్ని ప‌క్క‌న పెట్టేశాడు. (అదే క‌థ ఆ త‌ర‌వాత జ‌గ‌ప‌తిబాబుతో స‌ముద్రం పేరుతో తీశాడు కృష్ణ‌వంశీ).

హైద‌రాబాద్ తిరిగొచ్చే లోగా.. నాగ్ కోసం ఓ ఫ్యామిలీ డ్రామాని అల్లుకున్నాడు. హ‌మ్ ఆప్ కే హై కౌన్‌, దిల్ వాలే దుల్హ‌నియా లేజాయింగే – లైనులోనే సాగే సినిమా అది. అలాంటి జోన‌ర్లు తెలుగులో చాలా కొత్త‌. స‌హ‌జ‌మైన వాతావ‌ర‌ణం, డ్రామాలేని సంభాష‌ణ‌ల‌తో ఓ క‌థ చెప్పాల‌నుకున్నాడు. దానికి త‌గ్గ‌ట్టేసీన్లు అల్లుకున్నాడు. హైద‌రాబాద్ లో రాముడొచ్చాడు షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు సెట్లోనే `నిన్నే పెళ్లాడ‌తా` ఐడియాని కేవ‌లం 3 నిమిషాల్లో చెప్పాడు కృష్ణ‌వంశీ. నాగ్ ఓకే అనేశాడు. ఆ త‌ర‌వాత ప‌దిహేను రోజుల్లో స్క్రిప్టు పూర్త‌య్యింది.

ఈ కథ‌కి శ్రీ‌దేవి లాంటి హీరోయిన్ కావాలి. అయితే నాగ్ ప‌క్క‌న శ్రీ‌దేవిని ఆల్రెడీ చూసేశారు. అందుకే మ‌రో కొత్త అమ్మాయిని ప‌ట్టుకోవాల్సివ‌చ్చింది. దాని కోసం ఏకంగా 70మంది అమ్మాయిల్ని ఆడిష‌న్ చేశారు. ఏ ఒక్క‌రూ న‌చ్చ‌లేదు. చివ‌రికి ట‌బుపై దృష్టి ప‌డింది. ట‌బుని క‌ల‌వ‌డానికి ముంబై వెళ్లాడు కృష్ణ‌వంశీ. అక్క‌డ రోడ్డు క్రాస్ చేస్తున్న‌ప్పుడు ట‌బుకి క‌థ మొత్తం చెప్పేశాడు. అలా… రోడ్డుమీద ఓ హీరోయిన్ కి క‌థ చెప్పిన ఘ‌న‌త కృష్ణ‌వంశీకే ద‌క్కిందేమో..? ట‌బు ఈ సినిమాకి చాలా ప్ల‌స్ అయ్యింది. ట‌బుని నాగ్ `పండు` అని పిల‌వ‌డం ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా అనిపించింది. ఆ త‌ర‌వాత‌… చాలా మంది కుర్రాళ్లు త‌మ గాళ్ ఫ్రెండ్ల‌కు పండూ అనేది నిక్ నేమ్ గా పెట్టి పిల‌వ‌డం మొద‌లెట్టారు.

ఇక పాట‌ల గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సందీప్ చౌతా పేరు ఈ సినిమాతో మారుమోగిపోయింది. ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు పాట ఎవ‌ర్ గ్రీన్ హిట్. నాగార్జునే ఈ సినిమాకి నిర్మాత కాబ‌ట్టి.. కృష్ణ‌వంశీ అనుకున్న‌ది అనుకున్న‌ట్టు ఈ సినిమాని తీయ‌గ‌లిగాడు. 1996 అక్టోబ‌రు 4న విడుద‌లైన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఆ రోజుల్లో బాక్సాఫీసు ద‌గ్గ‌ర 12 కోట్ల షేర్ ద‌క్కించుకుంది. అప్ప‌టికి నాగార్జున కెరీర్‌లో అదే రికార్డు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘విశ్వంభ‌ర‌’లో ప‌వ‌న్‌.. అంత సీన్ ఉందా?

చిరంజీవి న‌టిస్తున్న సోషియో ఫాంట‌సీ చిత్రం 'విశ్వంభ‌ర‌'. వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌. ఈ చిత్రంలో చిరంజీవి భీమ‌వ‌రం దొర‌బాబుగా, ఐదుగురు చెల్లెమ్మ‌ల‌కు అన్న‌య్య‌గా క‌నిపించ‌నున్నారు. దాదాపు 40...

రివర్స్ ప్రచారం : మేనిఫెస్టో గురించి చెప్పుకోలేని జగన్ !

అధికార పార్టీ నేతగా.. సీఎంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ ప్రచారసభల్లో ఏం చెబుతున్నారు ?. మళ్లీ గెలిస్తే ఏం చేస్తానో చెబుతున్నారా ?. తన మేనిఫెస్టో...

కడప లోక్ సభ రివ్యూ : కొంగు సెంటిమెంట్ ఫలిస్తే సంచలనమే !

కడప లోక్ సభ బరిలో " ఎలగైనా అవినాష్ రెడ్డే గెలుస్తారు " అని వైసీపీ నేతలు ధీమాగా చెప్పుకుంటున్నారు. ఎలాగైనా అనే పదం వాడతూ వ్యక్తం చేస్తున్న...

‘స‌లార్ 2’… రెడీ టూ షూట్‌!

ప్ర‌భాస్ మూడ్ మొత్తం సినిమాల‌పైనే ఉంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా, షూటింగులు చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ 'క‌ల్కి'తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌, ఆ త‌ర‌వాత 'రాజాసాబ్' కు కొన్ని డేట్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close