చిరంజీవిని పవన్ కల్యాణ్‌ నిజంగానే టార్గెట్ చేశారా..? ఫ్లోలో అనేశారా..?

“నడపలేక వేరే పార్టీలో కలిపేసి ఇంట్లో కూర్చునే నేతలొద్దు..” “నేను రాజకీయాల్లో ఫెయిలయితే వెళ్లి సినిమాలు చేసుకునే టైప్ కాదు..” ఇలాంటి మాటలు ఎవరి నోటి వెంట వచ్చినా ముందు అందరికీ గుర్తుకు వచ్చేది.. ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవినే. మెగాస్టార్ గా సినిమాల్లో సాధించాల్సినదంతా సాధించేశానని.. ఇక రాజకీయాల్లోకి వెళ్తున్నానని చెప్పి… గ్రాండ్‌గా పెద్ద పార్టీ ఇచ్చి.. వీడ్కోలు చెప్పారు. కానీ ఐదేళ్లు తిరిగేసిరికి.. రాజకీయ పార్టీ పెట్టడం… ఎమ్మెల్యే అవడం… కాంగ్రెస్ పార్టీలో కలపడం.. ఎంపీ అవడం.. కేంద్రమంత్రి అవడం.. మళ్లీ పాలిటిక్స్‌లో జీరో స్థాయికి రావడం జరిగిపోయాయి. ఇప్పుడు ఆయన మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారు. చిరంజీవి రాజకీయ జీవితంలో… పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం అనేది చాలా పెద్ద డెవలప్‌మెంట్. అది ఒప్పో తప్పో.. విశ్లేషించేవారిని బట్టి ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్.. మాత్రం నిర్ణయంపై మొదటి సారి బహిరంగంగా స్పందించారు. పార్టీని నడపలేక… ఇతర పార్టీల్లో కలిపే ఇంట్లో కూర్చునే నేతలొద్దని.. నేరుగా చెప్పేశారు. ప్లోలో.. మంత్రి గంటా శ్రీనివాసరావు అలా చేశారని చెప్పుకొచ్చారు కానీ.. ఎప్పుడూ..గంటా శ్రీనివాసరావు పార్టీ పెట్టలేదు. పీఆర్పీలోనే ఆయన కీలకంగా వ్యవహరించారు.

అన్నయ్య అంటే అమితమైన అభిమానం చూపే… పవన్ కల్యాణ్.. ప్రజారాజ్యం విషయంలో అంత తీవ్రంగా ఎందుకు స్పందించారో..? . ఇదొక్కటే కాదు.. చిరంజీవి రాజకీయాలను వదిలేసి..మళ్లీ సినిమాలు చేయడంపైనా సెటైర్లు వేశారు. తను పెట్టిన రాజకీయ పార్టీ ఫెయిలయితే.. మళ్లీ వెళ్లి.. సినిమాలు చేసుకునే వాడ్నికాదని.. ప్రజల కోసం పోరాడుతాననని ప్రకటించారు. అంటే.. చిరంజీవి అలా రాజకీయాల నుంచి విరమించుకుని మళ్లీ సినిమాలు చేసుకోవడాన్ని తప్పు పడుతున్నారా..? తాను అన్నయ్య చిరంజీవిలా చేయబోనని గట్టిగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారా..? అన్నది పెద్దగా ఎవరికీ అర్థం కాలేదు కానీ..చిరంజీవి చేసింది కరెక్ట్ కాదని తేల్చి చెప్పడం మాత్రం అందులో ఉన్న పచ్చి నిజం.

మరి పవన్ కల్యాణ్ నిజంగానే అన్నయ్యను టార్గెట్ చేశారా..? లేక ముందస్తుగా కసరత్తు చేయకుండా వచ్చి..ఏం మాట్లాడాలో తెలియక.. మాట్లాడేశారా..? ఒక వేళ ఏం మాట్లాడాలో తెలియక పోతో పార్టీల విలీనాలు.. మళ్లీ సినిమాలు చేయడం గురించి మాత్రమే చెప్పడం ఎందుకు…? ఏంటో అంతా కన్ఫ్యూజన్. పవన్ కల్యాణ్‌కు అయినా క్లారిటీ ఉందేమో..? ప్రత్యేక వ్యూహం ప్రకారమే చిరంజీవిని టార్గెట్ చేసి ఉంటే.. దాని పరిణామాలు ముందు ముందు ఉంటాయేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close