బాల‌య్య – అనిల్ రావిపూడి.. అతి త్వ‌ర‌లో!

వంద కొట్టాక నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రింత స్పీడు పెంచేశాడు. చ‌క చ‌క సినిమాలు చేసేస్తున్నాడు. 2019 నే తీసుకోండి. జ‌న‌వ‌రిలో ఓ సినిమా (క‌థానాయ‌కుడు), ఫిబ్ర‌వ‌రిలో మ‌రో సినిమా (మ‌హా నాయ‌కుడు) ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. ఆ వెంట‌నే బోయ‌పాటి శ్రీ‌ను సినిమా మొద‌లైపోతుంది. ఈ యేడాదిలోనే దాన్నీ విడుద‌ల చేయాల‌న్న‌ది బాల‌య్య ప్లాన్‌. కాక‌పోతే… బోయ‌పాటి కాస్త స్లో. మేకింగ్ స్పీడు స్పీడుగానే ఉన్నా… సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి కాస్త స‌మ‌యం తీసుకుంటారు. అయితే.. బోయ‌పాటి సినిమా ఈ యేడాది వ‌చ్చినా, రాకున్నా – 2019లోనే మ‌రో సినిమాకీ శ్రీ‌కారం చుట్టాల‌ని భావిస్తున్నాడు బాల‌య్య‌. ఆ అవ‌కాశం అనిల్ రావిపూడి కి ద‌క్క‌డం దాదాపు ఖాయ‌మైపోయింది. `ప‌టాస్‌` త‌ర‌వాత అనిల్ రావిపూడి – బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా వ‌స్తుంద‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే అది అప్ప‌ట్లో సాధ్యం కాలేదు. ఈలోగా మ‌రో రెండు హిట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. అప్ప‌ట్లో అనిల్ రావిపూడి చెప్పిన క‌థ బాల‌య్య‌కు తెగ న‌చ్చింద‌ని, అందుకే ఇప్ప‌టికీ వీరిద్ద‌రి మ‌ధ్య ఆ క‌థ‌కు సంబంధించిన డిస్క‌ర్ష‌న్స్ న‌డుస్తున్నాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమానీ ఎన్‌బికే బ్యాన‌ర్‌లోనే చేయాల‌ని బాల‌య్య భావిస్తున్నాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం `ఎఫ్ 2` ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్నాడు అనిల్ రావిపూడి. ఆ సినిమా అయ్యాక‌.. కొంత గ్యాప్ తీసుకుంటాడు. ఎలాగూ బోయ‌పాటి సినిమా ఒక‌టి ఉంది కాబ‌ట్టి అనిల్ రావిపూడి ఈ మ‌ధ్య‌లో మ‌రో సినిమా పూర్తి చేసి రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

“ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్” చుట్టూ ఏపీ రాజకీయం !

ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్లైమాక్స్ కు చేరుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా అందరి నోట్ల నలుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. ఆ చట్టంలో ఉన్న...

రౌడీ బ‌ర్త్ డేకి.. బోలెడ‌న్ని స‌ర్‌ప్రైజ్‌లు

ఈనెల 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా రౌడీ కొత్త సినిమా సంగ‌తులన్నీ ఒకేసారి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. విజ‌య్ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close