క్యా సెట్టింగ్ హై..! “కేదార్‌నాథ్‌ మోడీ” సూపర్ హిట్..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీని… చాలా మంది నటుడు అని ఈ మధ్య విమర్శిస్తున్నారు. అక్షయ్ కుమార్‌తో ఇంటర్యూ.. ఆ తర్వాత… కొన్ని చానళ్ల ఇంటర్యూల్లో.. పెరిగిపోయిన నాటకీయత కారణంగా.. ఈ విమర్శలు చేస్తున్నారు. ప్రియాంకగాంధీ అయితే… మోడీ గొప్ప నటుడు అనేశారు. ఇలా ఎన్ని విమర్శలు వచ్చినా… నరేంద్రమోడీ మాత్రం వెనక్కి తగ్గరు. ఆ విషయం కేదార్ నాథ్ పర్యటనతో తేలిపోయింది.

ఆ శివుడి కన్నా ఈ మోడీనే ఎక్కువైపోయారు..!

ప్రచారం ముగిసిన తర్వాత కేదారనాథ్‌లో ప్రత్యేకపూజలు చేశారు. అయితే ఆధ్యాత్మిక యాత్రలో ప్రధాని మోదీ వస్త్రధారణ… భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆయన వేషధారణను భక్తులు వింతగా చూడాల్సి వచ్చింది. లాంగ్‌ సల్వార్‌, మెడలో రుద్రాక్షలు, భుజంపై శాలువా, చేతిలో కర్ర, నెత్తిన రెండు రంగుల టోపీ, నడుముకు కాషాయ వస్త్రం, కాళ్లకు షూ …ఇలా కనిపించారు. కాసేపు గొడుగును పట్టుకుని ముందుకు వెళ్లారు మోదీ. ఓ చోట పెద్ద గొడుగు కింద సేదదీరారు. మోడీ వస్తున్న కారణంగా భక్తుల్ని ముందుగానే నిలిపివేశారు. కానీ.. మోడీ తన హావభావాల్లో లోటు మాత్రం రానీయలేదు. తనను భక్తులు గ్రీట్ చేస్తున్నట్లుగా.. అభివాదం చేసుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. చేతులు ఊపుతూ సందడిచేశారు.

అక్కడే మోడీకో ధ్యానరాత్రి ..!

హిమాలయాలపైకి చేరుకునేటప్పుడు పర్వత ప్రాంతంపై నుంచి సూర్య నమస్కారం చేశారు. ఆ తర్వాత ఆలయంలోని గూహలోకి వెళ్లి కేదారనాథుడ్ని ప్రార్థించారు. రాత్రి పూట అంతా.. ధ్యానం చేసుకుంటూ గడిపేశారు. ప్రచారం ముగిసిన తర్వాత మీడియాలో కనబడటం కష్టమని ఇతర రాజకీయ నాయకులకు ఏమైనా అభిప్రాయాలుంటే.. మోడీ వాటిని పక్కన పెట్టేశారని చెప్పుకోవాలి. ఆయన వేసిన విచిత్రమైన వేషం, వాటితో ఆయన తిరిగిన ప్రాంతాలు… చూపించిన హావభావాలు సూపర్ హిట్టయ్యాయి. మీడియా అదే పనిగా చూపించింది.

షూటింగ్ మాత్రం పర్‌ఫెక్ట్..!

చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తుల కోసం… చేయనన్ని ఏర్పాట్లను మోడీ కోసం చేశారు. ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేస్తారని రెడ్ కార్పెట్ కూడా వేశారు. మోడీ ప్రతి కదలికను షూట్ చేయడానికి.. అత్యాధునిక కెమెరాలు.. నైపుణ్యం ఉన్న సిబ్బంది వెంట ఉన్నారు. చివరికి.. గుహలో మోడీ ధ్యానం చేసేటప్పుడు కూడా.. కెమెరా యాంగిల్‌లో కూడా తేడా రాకుండా షూట్ చేసి మీడియాకు.. ఇచ్చారు. అందుకే.. కేదార్ నాథ్ మోడీ.. సూపర్ హిట్టయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close