రాహుల్ ఎన్నికల బహిష్కరణ ప్లాన్..! కాంగ్రెస్‌లో కంగారు..!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ… సహాయ నిరాకరణ పేరుతో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ .. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకపోవడానికి ప్రధాన కారణం ప్రజలు.. ఓటర్లు కాదని.. కచ్చితంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లేనని ఆయన నమ్ముతున్నారు. దీనికి సంబంధించి కొంత డేటా ఆయన దగ్గర ఉండటంతో… అసలు బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేయడం కన్నా.. ఈవీఎంలపై పోరాటం చేయడం బెటరని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈవీఎంల వల్లే బీజేపీ గెలిచిందని రాహుల్ నమ్మకం..!

రాహుల్ గాంధీ.. ఈవీఎంలపై… తన పోరాటం ప్రజల్లోకి వెళ్లేలా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని చెబుతున్నారు. అందులో మొదటి.. ఎన్నికల బహిష్కరణ. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని.. బ్యాలెట్లతో ఎన్నికలు పెట్టాలనే డిమాండ్ తో… ఈ ప్రయత్నం చేయాలని.. నిర్ణయించుకున్నట్లుగా కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతోనే వదిలి పెట్టకుండా.. దేశవ్యాప్తంగా కలసి వచ్చే పార్టీలో భారీ ఉద్యమాన్ని నిర్మించాలని రాహుల్ గాంధీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈవీఎంలతోనే… బీజేపీ గెలిచిందని… అవి లేకపోతే.. ప్రజాతీర్పు మరోలా ఉంటుందని రాహుల్ గట్టిగా నమ్ముతున్నారు.

బ్యాలెట్‌తో నిర్వహించకపోతే అసెంబ్లీ ఎన్నికల బహిష్కరణ..!

రాహుల్ గాంధీ ఆలోచనలపై.. కాంగ్రెస్‌లోనే… కలకలం రేగింది. అనేక మంది నేతలు… ఈ నిర్ణయం సరి కాదని.. వాదిస్తున్నారు. ఈవీఎంలపై.. ఆరోపణలు చేయడం కన్నా.. ప్రజల్లోకి వెళ్లి పోరాడదామని సూచిస్తున్నారు. అయితే.. సోనియా గాంధీకి కూడా.. ఈవీఎంలపై అనుమానాలున్నాయి. కొద్ది రోజుల కిందట.. మీడియాతో మాట్లాడుతూ.. ఆమె కూడా… ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఈవీఎంలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి.. ఆమె వాటిని వ్యతిరేకించలేని పరిస్థితి ఉంది. అందుకే.. రాహుల్ సహాయనిరాకరణ ఉద్యమంపై.. ఆమె అంత సానుకూలంగా లేరన్న భావన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.

కాంగ్రెస్‌లోనూ దొరకని మద్దతు..! ముందడుగు వేస్తారా..?

బ్యాలెట్ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ పోరాటం ప్రారంభిస్తే… కచ్చితంగా అది ఆయన ఒంటరిగానే ప్రారంభించాలి. నిజానికి.. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలపై విశ్వసనీయత లేకుండా పోయింది. గెలిచిన వాళ్ల వైపు.. అనుమానంగా చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో… రాహుల్ గాంధీ… గట్టిగా నిలబడితే.. ఆయన పోరాటానికి మద్దతు లభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే… 21 పార్టీలు ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అన్నీ కలసి వస్తే.. పోరాటానికి మద్దతు పెరుగుతుంది. ప్రజలు కూడా.. సపోర్ట్ చేస్తే కేంద్రం దిగిరాక తప్పదు. అయితే.. అప్పటి వరకూ రాహుల్ గాంధీ వెటకారాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close