రుణమాఫీ వాయిదాల కోసం రైతులతో ఉద్యమం..!?

తెలుగుదేశం పార్టీ మళ్లీ జవసత్వాలను కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. సోషల్ ఇంజినీరింగ్‌లో దెబ్బతిన్నామని.. అంతర్గతంగా విశ్లేషణకు వచ్చిన టీడీపీ.. చాలా వేగంగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. ఆరు నెలల సమయం ఇవ్వాలని అనుకున్నప్పటికీ.. రెండు నెలలలోనే ప్రభుత్వంపై అసంతృప్తి చాయలు ప్రజల్లో కనిపించడంతో.. టీడీపీ వ్యూహాత్మకంగా పోరాటం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ముందుగా.. రైతు పోరాటాలకు నేతృత్వం వహించాలని నిర్ణయించుకుంది.

రుణమాఫీ వాయిదాల కోసం ఉద్యమం..! న్యాయపోరాటం..!

రుణమాఫీ.. రెండు కిస్తీల డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోతే .. న్యాయపోరాటం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. రుణ మాఫీ డబ్బులు చెల్లించకపోతే రైతులతో కలసి కోర్టు లకు వెళ్తామని ఇప్పటికే టీడీపీ అధినేత అధికారిక ప్రకటన చేశారు. న్యాయపోరాటానికి.. టీడీపీకి కావాల్సినంత సరంజామా ఉందని ఆయన నమ్ముతున్నారు. ఎందుకంటే.. రుణమాఫీ హామీ టీడీపీ ఇచ్చినప్పటికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని చట్టబద్ధం చేశారు. ఇప్పటికే.. గత సర్కార్‌లో రుణమాఫీకి సంబంధించి బడ్జెటరీ ప్రాసె్స్ పూర్తి చేశారు. చెక్కులు కూడా జారీ అయి.. బడ్జెట్ ఆమోదం పొందింది. అంతకు ముందే.. ప్రభుత్వం.. రుణవిమోచన పత్రాలు.. బాండ్లు ఇచ్చింది. వాటిని ప్రభుత్వం అంగీకరించి తీరాలి. సంబంధం లేదని తప్పించుకోవడానికి వీలులేదని టీడీపీ న్యాయవిభాగం అంచనా వేస్తోంది.

అక్టోబర్‌లో రైతులకు రైతుభరోసా తర్వాత అసలు కార్యాచరణ..!

వైసీపీ సర్కార్.. రైతులకు అక్టోబర్‌లో.. రూ. 12,500 రైతు భరోసా కింద ఇస్తామని ప్రకటించింది. ఆ చెక్కులను అక్టోబర్‌లో ఇస్తారు. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారు. ఆ పథకం కింద.. రెండు విడతలుగా పదిహేను వేలు రైతులకు అందేవి . కానీ జగన్ సర్కార్.. ఆ మొత్తాన్ని రూ. 12,500 గా నిర్ధారించింది. ఇప్పుడు.. ఆ మొత్తం నుంచి.. కేంద్రం.. రూ. ఆరు వేలు ఇస్తుందని చెబుతున్నారు. అంటే.. ఏపీ సర్కార్ ఇచ్చేది రూ. ఆరు వేలు ఐదు వందలు. ఈ చెక్కులు ఇచ్చినప్పుడు.. రైతుల్లో ఆగ్రహం వెల్లువెత్తడం ఖాయమని.. టీడీపీ అంచనా వేస్తోంది. ఆ ఆగ్రహం వేదికగానే.. భారీ ఉద్యమానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అనుకుంటున్నారు.

రైతుల అసంతృప్తిని ఎదుర్కోవడం ప్రభుత్వానికి క్లిష్టమే..!

రైతు రుణమాఫీ రెండు కిస్తీలు విడుదల చేస్తే.. సంతోషపడేది రైతులే. రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసీపీ సర్కార్.. వారికి లాభం కలిగించే చర్యలను ఎందుకు పక్కన పెడుతుందో చాలా మందికి అర్థం కావడం లేదు. టీడీపీ హామీ ఇచ్చింది.. చేయలేకపోయింది.. తాము వచ్చి చేశామని చెప్పుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ.. రుణమాఫీ అంశాన్ని.. పక్కన పెట్టేయడం.. రైతుల్లో వైసీపీ పై అసంతృప్తి పెరగడానికి కారణం అవుతోంది. ఇప్పుడు .. టీడీపీ ఈ అంశాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తూండటం.. వైసీపీకి ఇబ్బందికరమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిప్పుల కుంపటిలా తెలంగాణ..

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మరింత ముదురుతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు వేసవి తీవ్రత ఇలాగే ఉంటుందని.. ఎండతోపాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ...

రేవంత్ కు హైకమాండ్ అభినందనలు..ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును...

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close