‘దేవ‌దాస్‌’ ద‌ర్శ‌కుడి క్రైమ్ స్టోరీ

భ‌లే మంచి రోజుతో ద‌ర్శ‌కుడిగా ఆక‌ట్టుకున్నాడు శ్రీ‌రామ్ ఆదిత్య‌. ఆ త‌ర‌వాత‌… శ‌మంత‌ణ‌మ‌ణి తీశాడు. అది కూడా క్రైమ్ స్టోరీనే. ‘దేవ‌దాసు’ త‌ర‌వాత శ్రీ‌రామ్ ఆదిత్య సినిమా ఒక‌టి ప‌ట్టాలెక్కుతోంది. గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు ఈసినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్టుకి దిల్ రాజు నిర్మాత‌. కానీ ఆయ‌న ఇప్పుడు ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నారు. దాంతో జ‌య‌దేవ్ ఈ చిత్రాన్ని స్వ‌యంగా నిర్మిస్తున్నారు. ఇదో క్రైమ్ థ్రిల్ల‌ర్ అని తెలుస్తోంది. మ‌ద‌ర్ సెంటిమెంట్ కూడా ఉంద‌ట‌. ‘కార్తీక దీపం’ సీరియ‌ల్‌లో అత్త‌గా న‌టించిన అర్చ‌న‌ని క‌థానాయిక త‌ల్లి పాత్ర కోసం ఎంచుకున్నారు. క‌థానాయిక‌, ఇత‌ర న‌టీన‌టుల ఎంపిక పూర్త‌యింది. త్వ‌ర‌లోనే టైటిల్‌తో స‌హా, ఈ ప్రాజెక్టు గురించిన పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

ఇదేం టైటిల్ రౌడీ బోయ్‌…?

సంతోషం స‌గం బ‌లం అంటారు. సినిమాకు టైటిల్ కూడా అంతే. టైటిల్ ఎంత క్యాచీగా, ఎంత కొత్త‌గా ఉంటే అంత ప్ల‌స్సు. అందుకే టైటిల్ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతూ...

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close