మే 1న రాబోతున్న సినిమా ‘గాయపడ్డ సింహం’. తరుణ్ భాస్కర్ హీరోగా నటించారు. కశ్యప్ దర్శకుడు. మరో దర్శకుడు పవన్ సాధినేని నిర్మాణ సారధ్యం వహించారు. ధర్మ పాత్రలో.. జేడీ చక్రవర్తి విలనిజం పండించారు. మే 1న బాక్సాఫీసు దగ్గర పెద్దగా పోటీ లేదు. కాబట్టి.. `గాయపడ్డ సింహం` సినిమాకు అడ్వాంటేజీ చేకూరే అవకాశం ఉంది.
ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోందని తెలుస్తోంది. దానికి సంబంధించిన లీడ్ కూడా క్లైమాక్స్ లో ఉందని సమాచారం. అయితే ఆ సీక్వెల్ లో మాత్రం తరుణ్ భాస్కర్ కనిపించరు. మరో హీరో నటిస్తారు.
‘గాయపడ్డ సింహం’లో ఓ యువ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నారని ప్రచారం ముందు నుంచీ గట్టిగా జరుగుతోంది. చిత్రబృందం కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే ఆ హీరో ఎవరన్నది సస్పెన్స్. ఆ హీరోనే సీక్వెల్ లో నటిస్తారని తెలుస్తోంది. మే 1లోగా ఆ హీరో పేరుని చిత్రబృందం రివీల్ చేయాలని చూస్తోంది. ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ ఇంకా రాలేదు. బహుశా ఆ ట్రైలర్ లో గెస్ట్ రోల్ కి సంబంధించిన లీడ్ ఉండే అవకాశం ఉంది. ట్రైలర్ లో ఏ హీరో కనిపిస్తారో, ఆయనతోనే సీక్వెల్ చేస్తారన్న మాట.
