ఓటీటీలో… విశ్వ‌క్ ఎంట్రీ!

సినిమాకి పోటీగా, ధీటుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ త‌యార‌వుతున్నాయి. భారీ బడ్జెట్లు, అదిరిపోయే కాస్టింగ్‌, దిమ్మ తిరిగే కంటెంట్ తో వెబ్ సిరీస్ లు ఆక‌ట్టుకుంటున్నాయి. న‌వ‌త‌రం హీరోల‌కూ ఈ వెబ్ సిరీస్‌లు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నాయి. భారీ పారితోషికాలు వ‌స్తుండ‌డంతో… వాళ్లూ వెబ్ సిరీస్ ల‌లో న‌టించ‌డానికి మొగ్గు చూపిస్తున్నారు. తాజాగా విశ్వ‌క్ సేన్ కూడా త్వ‌ర‌లోనే వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఆ విష‌యాన్ని విశ్వ‌క్ కూడా ధృవీక‌రించాడు. త్వ‌ర‌లోనే ఓ వెబ్ సిరీస్‌లో న‌టించ‌బోతున్నాన‌ని, ఆ కంటెంట్ మ‌హా స్ట్రాంగ్‌గా ఉంటుంద‌ని, క‌థ న‌చ్చ‌డం వ‌ల్లే… వెబ్ సిరీస్ చేయ‌డానికి ఒప్పుకున్నాన‌ని క్లారిటీ ఇచ్చాడు.

మ‌రో విష‌యం ఏమిటంటే.. `పెళ్లి చూపులు` ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఓ వెబ్ సిరీస్ తెర‌కెక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. `ఈ న‌గ‌రానికి ఏమైంది` పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొంద‌నుంది. ఈ పేరుతో ఓ సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో విశ్వ‌క్ సేనే క‌థానాయకుడు. బ‌హుశా… విశ్వ‌క్ న‌టించబోయే వెబ్ సిరీస్ కూడా అదే అయ్యుంటుంది. సినిమాల‌కు సీక్వెల్స్ రావ‌డం స‌హజ‌మే. వెబ్ సిరీస్‌ల‌కు కూడా సీజ‌న్‌ల పేరుతో సీక్వెల్స్ వ‌స్తుంటాయి. అయితే ఓ సినిమాకి సీక్వెల్ గా ఓ వెబ్ సిరీస్ రావ‌డం మాత్రం కొత్తే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close