మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో… ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ సుకుమార్ ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష స‌హ‌కారం ఉంటూనే ఉంటోంది. `ఉప్పెన‌` గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మైత్రీకి ద‌క్కిన మ‌రో సూప‌ర్ హిట్ ఇది. దీనికి క‌ర్త క‌ర్మ క్రియ అన్నీ.. సుకుమారే.

ఉప్పెన హీరో వైష్ణ‌వ్ తేజ్ తో మైత్రీ మూవీస్ మ‌రో రెండు సినిమాలు చేయ‌బోతోంది. దీనికి సంబంధించిన బాధ్య‌త‌ల‌కు కూడా సుకుమార్ పైనే వేసింది మైత్రీ మూవీస్‌. వైష్ణ‌వ్ కి స‌రిప‌డ‌.. క‌థ సెట్ చేయ‌డం, ద‌ర్శ‌కుడ్ని టీమ్ అప్ చేయ‌డం సుకుమార్ బాధ్య‌త‌. అవ‌స‌ర‌మైతే.. ఈ రెండు సినిమాల్లోనూ సుకుమార్ కి వాటా ఇవ్వ‌డానికి మైత్రీ రెడీగా ఉంది. సుకుమార్ కూడా.. వైష్ష‌వ్ కోసం క‌థ‌లు విన‌డానికి, త‌న వంతు ఇన్‌పుట్స్ ఇవ్వ‌డానికి ఉత్సాహంగానే ఉన్నాడ‌ట‌. సో.. రాబోయే రోజుల్లోనూ వీరిద్ద‌రి మైత్రీ ఇంకా స్ట్రాంగ్ గా మార‌బోతోంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close