ఇప్పుడంతా `శ్రీ లీల‌`నే

టాలీవుడ్ ఓ కొత్త హీరోయిన్ వ‌చ్చిందంటే – చూపంతా అటువైపుకి వెళ్లిపోతుంది. ఎందుకంటే.. అస‌లే మ‌న‌కు హీరోయిన్ల కొర‌త‌. కాస్త ప్ర‌తిభుంటే చాలు. త‌రువాతి సినిమాలో పెట్టేసుకోవొచ్చ‌న్న‌ది నిర్మాత‌ల ఆత్రం. ఉప్పెన త‌ర‌వాత కృతి శెట్టి జీవితం మొత్తం మారిపోయింది. ఒకే ఒక్క హిట్.. ఆమెని స్టార్ హీరోయిన్ల ప‌క్క‌న నిల‌బెట్టింది. ఇప్పుడు శ్రీ‌లీల ప‌రిస్థితీ అంతే.

పెళ్లి సంద‌డి సినిమాతో తెరంగేట్రం చేసింది శ్రీ‌లీల‌. గ‌త‌వారం విడుద‌లైన ఈ సినిమాకి దారుణ‌మైన రివ్యూలొచ్చాయి. కాక‌పోతే వ‌సూళ్ల ప‌రంగా కాస్త మెరుగ్గా ఉంది. దానికి తోడు శ్రీ‌లీల‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. కాస్త బొద్దుగా, చూడ‌గానే ఆక‌ట్టుకునేలా ఉంది శ్రీ‌లీల‌. పైగా డాన్సుల్లో ఈజ్ చూస్తే మ‌తి పోయింది. రాఘ‌వేంద్ర‌రావు ఫ్రేమ్ లో… శ్రీ‌లీల మ‌రింత అందంగా క‌నిపించింది. నిజానికి ఈసినిమా విడుద‌ల‌కు ముందే.. శ్రీ‌లీల దృష్టి టాలీవుడ్ పై ప‌డింది. ర‌వితేజ సినిమాలో శ్రీ‌లీల హీరోయిన్ గా ఫిక్స‌య్యింది. ఇప్పుడు రిలీజ్ అయ్యాక‌.. మ‌రిన్ని అవ‌కాశాలు వ‌రుస క‌డుతున్నాయి. శ‌ర్వా, నితిన్‌, నిఖిల్, సాయిధ‌ర‌మ్ తేజ్‌.. ఇలాంటి యంగ్ బ్యాచ్ ప‌క్క‌న శ్రీ‌లీల అయితే బాగుంటుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. కొత్త హీరోల‌కైతే త‌ను మంచి ఆప్షనే. ఇప్ప‌టికి త‌న చేతిలో నాలుగు సినిమాలున్నాయని తెలుస్తోంది. కొత్త‌గా మ‌రో రెండు ఆఫ‌ర్లూ వ‌చ్చాయ‌ట‌.చూస్తుంటే… శ్రీ‌లీల ఇండ్ర‌స్ట్రీలో కొన్నాళ్లు పాతుకుపోయేలానే క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close