ఆర్కే పలుకు : వివేకా కేసులో షర్మిల సాక్ష్యం !?

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏపీ సీఎం జగన్‌కు కొత్త ఏడాది స్క్రిప్ట్ ఎలా ఉంటుందో ట్రైలర్ చూపించేందుకు ఈ వారం తన ఆర్టికల్ కొత్తపలుకును ఉపయోగించుకున్నారు. ఇప్పటి వరకూ అక్రమాస్తుల కేసే ఆయనను వెంటాడుతోందని ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి కేసు కూడా ఆయనను చుట్టుముట్టబోతోందని తేల్చేశారు. ఈ వారం ఆర్టికల్‌లో ఆర్కే చాలా ప్లాన్డ్‌గా మైండ్ గేమ్ ఆడారు. వైఎస్ భారతీరెడ్డి ప్రస్తావన తీసుకువచ్చారు. షర్మిల సాక్ష్యం గురించీ ప్రస్తావించారు. సీబీఐ అధికారుల దూకుడును కూడా వివరించారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు తేలుతాయో లేదో కానీ ఈడీ కేసులు మాత్రం తేలిపోతాయన్న అభిప్రాయం కొంత కాలంగా ఉంది. అదే జరిగితే తాన చాయిస్‌గా సీఎం జగన్ భారతీరెడ్డిని రెడీ చేస్తున్నారు. పాలనా వ్యవహారాల్లో ఇప్పటికే ఆమె జోక్యం చేసుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో ఆ చాయిస్ భారతీరెడ్డిది కాదని సీఎం జగన్ తల్లి విజయలక్ష్మిదని కుటుంబంలో గొడవ జరుగుతోందని ఆర్కే కొంత కాలంగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీరెడ్డికి చాన్స్ ఇవ్వకూడదని తల్లి విజయలక్ష్మికే అవకాశం ఇవ్వాలని షర్మిల పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. ఎగ్జాట్‌గా ఏమి జరుగుతుందో తెలియదు కానీ .. వైఎస్ కుటుంబంలో విభేదాలు బహిరంగ రహస్యంగా మారాయి.

ఇప్పుడు షర్మిలకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో ఈ విషయంలో జగన్ ను ఫిక్స్ చేసే అవకాశం షర్మిలకు లభించిందని ఆర్కే చెబుతున్నారు. ఎందుకంటే ఆమెను సాక్ష్యం చెప్పమని సీబీఐ అధికారులు సంప్రదించారట. దానికి ఆమె అంగీకరించి ప్రాథమికంగా కొన్ని వివరాలు చెప్పారని.., స్టేట్ మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారట. అంత వరకూ ఓకే కానీ ఈ అంశంలో ఆర్కే భారతీరెడ్డిని లాగేశారు. వివేకా హత్య జరిగిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోన్లు చేశారో బయటకు తీసిన సీబీఐ.. వారిలో భారతీరెడ్డి కూడా ఉన్నారని తేల్చారట. దీంతో భారతీరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించడానికి రెడీ అవుతోందని అంటున్నారు. ఇది నిజమో కాదో కానీ ఆర్కే అటు షర్మిల సాక్ష్యం.. ఇటు హత్య గురించి భారతీరెడ్డికి ముందే తెలుసు అన్న అంశం రెండింటిని ఒకే సారి తెరపైకి తెచ్చారు.

ఇంటర్ లింక్‌గా వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ చేధిస్తే… వైసీపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. జగన్ అక్రమాస్తుల కేసు కన్నా ఇదే పెద్ద సమస్య అయ్యే అవకాశఉంది. దీన్నే ఆర్కే తన ఆర్టికల్‌లో చెప్పీ చెప్పకుండా చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి 2022లో దేవుడు రాసిన గొప్ప స్క్రిప్ట్ ఎలా ఉండబోతోందో చూద్దామని వెటకారం ఆడారు. మొత్తంగా చూస్తే తొలి ఏడాది వైఎస్ జగన్‌ క్యాంప్ కు కాస్త టెన్షన్… ఆయన వ్యతిరేక మీడియాకు చెలగాటమాడగలిగే స్టఫ్ దొరికిందని అనుకోవాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close