అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అత్యాధునిక క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ ప్రారంభం కావడం ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. అయితే, ఈ అద్భుత సాంకేతికతను అర్థం చేసుకోలేక, దాని ఆకారాన్ని చూసి సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ట్రోల్స్ వారి అజ్ఞానానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి.
సాంకేతికత తెలియని తలతిక్క వాదనలు
ప్రపంచమంతా క్వాంటం కంప్యూటింగ్ వైపు అడుగులు వేస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం కొందరు ఈ అత్యాధునిక పరికరాన్ని చూసి ఆముదం తీసే మిషన్ , చికెన్ ఫ్రై చేసే మిషన్’ అంటూ వెకిలి పోస్టులు పెుతున్నారు. క్వాంటం కంప్యూటర్లు సాధారణ కంప్యూటర్లలా బాక్సుల్లో ఉండవని, అవి పనిచేయడానికి మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ అబ్సల్యూట్ జీరో ఉష్ణోగ్రత అవసరమని కనీస జ్ఞానం లేని వారు ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. ఆ టెస్ట్ బెడ్ పైన ఉన్న పైపులు, వైర్లు అత్యంత సంక్లిష్టమైన క్రయోజెనిక్ రిఫ్రిజిరేషన్ వ్యవస్థలో భాగమని శాస్త్రవేత్తలు చెబుతున్నా, సోషల్ మీడియా సైకోలు మాత్రం తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ వినోదం వెతుక్కుంటున్నారు.
రాష్ట్ర పరువు తీస్తున్న నిరక్షరాస్యత
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోనే మొట్టమొదటి సారిగా ఇలాంటి ఓపెన్ యాక్సెస్ క్వాంటం టెస్ట్ బెడ్ ను అందుబాటులోకి తీసుకువచ్చినప్పుడు, దాన్ని చూసి గర్వపడాల్సింది పోయి హేళన చేయడం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోంది. దేశ విదేశాల్లోని నిపుణులు అమరావతి వైపు ఆసక్తిగా చూస్తుంటే, స్థానికంగా ఉన్న కొందరు రాజకీయ ఉన్మాదులు చేస్తున్న ఈ ప్రచారం మన అక్షరాస్యతను, సంస్కారాన్ని ప్రశ్నిస్తోంది. విమర్శించడానికీ, అజ్ఞానాన్ని చాటుకోవడానికీ మధ్య ఉన్న సన్నని గీతను వీరు మరిచిపోయారు.
అసలు క్వాంటం టెస్ట్ బెడ్ అంటే ఏమిటి?
వైసీపీ సానుభూతిపరులు ఎద్దేవా చేస్తున్న ఆ మిషన్ క్వాంటం చిప్‌లను పరీక్షించే ఒక ప్రయోగశాల. ఇందులో ఉండే సూపర్ కండక్టింగ్ సర్క్యూట్లు అత్యంత వేగంగా లెక్కలు పూర్తి చేస్తాయి. సైబర్ సెక్యూరిటీ, ఔషధాల తయారీ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. దీని ఆకారం వింతగా ఉండటానికి కారణం అది శూన్యంలో మరియు అత్యంత శీతల స్థితిలో పనిచేయడమే. ప్రపంచంలోని ఐబిఎం , గూగుల్ వంటి సంస్థల క్వాంటం కంప్యూటర్లు కూడా సరిగ్గా ఇలాగే కనిపిస్తాయని, ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేసినా వీరి అజ్ఞానం వీరికి అర్థమయ్యేది.
చదువుకున్న మూర్ఖులే ఎక్కువ
అభివృద్ధిని చూసి ఓర్వలేకనో లేక సాంకేతికతపై అవగాహన లేకనో చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం అంతిమంగా రాష్ట్రానికే నష్టం కలిగిస్తుంది. విమర్శలు రాజకీయాలకే పరిమితం కావాలి కానీ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలను హేళన చేయడం వివేకం అనిపించుకోదు. సోషల్ మీడియాలో సెటైర్లు వేసే ముందు, తాము వేసే జోకులు తమ అజ్ఞానానికి అద్దం పడుతున్నాయని ఈ సైకోలు గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ అదే వారికి అవసరం లేదు.
