హాస్య‌న‌టుడి సంచ‌ల‌న నిర్ణ‌యం !

రాహుల్ రామ‌కృష్ణ‌… టాలీవుడ్లో ప్ర‌స్తుతం అత్యంత బిజీగా ఉండే హాస్య న‌టుల్లో తానొక‌డు. త‌న పారితోషికం రోజుకి ల‌క్ష‌కు పైనే. అయినా స‌రే కాల్షీట్లు అందుబాటులో లేవు. అలాంటి రామ‌కృష్ణ‌… ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. 2022 త‌ర‌వాత సినిమాల నుంచి వైదొలుగుతాన‌ని ప్ర‌క‌టించాడు. దాంతో.. రాహుల్ రామ‌కృష్ణ‌కు ఏమైంది?  అంటూ అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. శుక్ర‌వారం రాత్రి రాహుల్ ఓ ట్వీట్ చేశాడు. “2022 నా ఆఖ‌రి సంవ‌త్స‌రం. ఇక‌మీద‌ట సినిమాలు చేయ‌ను. ఎవ‌రేమ‌న్నా ప‌ట్టించుకోను. నా నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటా“ అని ప్ర‌క‌టించాడు. కార‌ణాలేం చెప్ప‌లేదు.

నిజంగానే రాహుల్ ఈ ట్వీట్ చేశాడా?  లేదంటే ఫ్రాంక్ చేస్తున్నాడా?  లేదంటే ఇది కూడా ప్ర‌మోష‌న్ల‌లో భాగ‌మా అనేది తెలియ‌డం లేదు. `జాతి ర‌త్నాలు`లో రాహుల్ చెప్పే ఓ ఫేమ‌స్ డైలాగ్ గుర్తొస్తోంది. `నా వ‌ల్లే ప్రాబ్ల‌మ్ అయితే నేను ఎళ్లిపోతా మామా` అనే డైలాగ్ బాగా న‌వ్వించింది. ఇప్పుడు కూడా అలానే ఆట ప‌ట్టిస్తున్నాడా?  అనేది మ‌రో ప్ర‌శ్న‌. మ‌రి.. దీని వెనుక ఏముందో?  రాహుల్ హ‌ర్ట‌య్యాడో, లేదంటే.. న‌వ్వించాల‌న్న ప్ర‌య‌త్నాలు మ‌రో ర‌కంగా చేస్తున్నాడో?  ఆయ‌న‌కే తెలియాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close