రాజ‌మౌళి నెక్ట్స్ ప్లానేంటి?

ఆర్‌.ఆర్‌.ఆర్ కోసం దాదాపు మూడేళ్లు రాత్రింబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డ్డాడు రాజ‌మౌళి. త‌నే కాదు…త‌న కుటుంబం మొత్తం.. ఈ ప్రాజెక్టుకి ప్రాణం పెట్టేసింది. త‌న ప్ర‌తీ సినిమాకీ ఇదే క‌ష్టం. అయితే సినిమా విడుద‌లైన త‌ర‌వాత కొంత‌కాలం ఈ సినిమా ప్ర‌పంచానికి దూరంగా వెళ్లిపోవ‌డం రాజ‌మౌళికి అల‌వాటే. ఇప్పుడూ అదే చేస్తున్నాడు. ఏప్రిల్ లో రాజ‌మౌళి త‌న‌కుటుంబంతో స‌హా విహార యాత్ర ప్లాన్ చేశాడు. విదేశాల్లో 15 రోజుల పాటు ఉండి తిరిగిరావాల‌న్న‌ది ఆలోచ‌న‌. అప్ప‌టికి `ఆర్‌.ఆర్‌.ఆర్‌` హ‌వా చ‌ల్ల‌బ‌డుతుంది. వ‌చ్చాక‌.. మ‌హేష్ బాబు తో సినిమా గురించిన స‌న్నాహాలు ఎలాగూ మొద‌లెట్టాలి. మ‌హేష్ తో ఎలాంటి సినిమా చేయాల‌న్న విష‌యంపై రాజ‌మౌళికి ఓ స్ప‌ష్ట‌త ఉంది. ఇప్ప‌టికే లైన్ త‌యారైపోయింది. దానిపై క‌స‌ర‌త్తు చేయాలంతే. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`ని మించి మ‌హేష్ బాబు సినిమా ఉంటుంద‌ని రాజ‌మౌళి ముందే హింట్ ఇచ్చేశాడు. మ‌హేష్ సినిమా ఓ మ‌ల్టీస్టార‌ర్ అని ఇది వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. దాన్ని రాజ‌మౌళి ఖండించాడు. ఇది సోలో హీరో సినిమానే అని తేల్చేశాడు. ఈ యేడాది ద‌స‌రా నుంచి మ‌హేష్ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫేక్ పోస్టులు , కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయం !

సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్లుగాఫేక్ చేసుకుంట ఒకరిపై ఒకరు బురద చల్లుకోడానికి చేస్తున్న రాజకీయం తెలంగామణలో కేసులు, అరెస్టుల వరకూ వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వీడియోను ట్విస్ట్...

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

‘లాపతా లేడీస్’ రివ్యూ: దారితప్పి మార్గం చూపిన పెళ్లి కూతుళ్ళు

'ధోబీ ఘాట్' లాంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావు, దాదాపు దశాబ్ద విరామం తర్వాత 'లాపతా లేడీస్' కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close