హ్యాపీ బర్త్ డే : పొలిటికల్ “టాస్క్” లీడర్ కేసీఆర్ !

కోట్ల మంది ప్రజల స్వప్నం తెలంగాణ రాష్ట్రం. దాన్ని నిజం చేసి చూపించారు కేసీఆర్. తెలంగాణ సాధకునిగా చరిత్రలో నిలిచిపోయిన ఆయన ఇప్పుడు దేశాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. రాజకీయాలు చాలా మంది గెలుపోటములుగా చూస్తారని తనకు మాత్రం టాస్క్ అని ఆయన చెబుతున్నారు. తెలంగాణను ఎనిమిదేళ్లలోనే కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశానని.. అదే మోడల్‌తో దేశాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆయన జాతీయ రాజకీయాలు ప్రారంభించారు. తన రాజకీయ జీవితాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన టీఆర్ఎస్ పార్టీని కూడా ఆయన బీఆర్ఎస్‌గా మార్చారు. కవచకుండలం లాంటి తెలంగాణ సెంటిమెంట్ ను కూడా వదులుకున్నారు.

కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఆయన వ్యూహాలు … ఆయన అడుగులు… ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. తన మాటలే మంత్రంగా ఆయన చేసే రాజకీయాలు తెలంగాణ ప్రజల్ని కట్టి పడేస్తాయి.. కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినట్లుగా రిటైరయ్యే దశలో కొత్త టాస్క్ ఎంచుకున్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి వెళ్తున్నారు. కేసీఆర్ రాజకీయ జీవితాన్ని పరిశీలించిన వారికి ఆయనను తక్కువ అంచనా వేయలేరు. ఎందుకంటే అసాధ్యం అనుకున్న పనులెన్నో ఆయన చేసి చూపించారు. అందుకే… అన్నీ వ్యతిరేకంగా కనిపిస్తున్నా.. బీఆర్ఎస్ కనీస ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను నిలబెట్టగలదా అనే డౌట్స్ ఉన్నా… అక్కడ ఉంది కేసీఆర్ అనే కంక్లూజన్‌కు వస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నది కళ్ల ముందు కనిపించే నిజం. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి .. రైతులకు అండగా నిలబడటానికి ఆయన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఆయన చేసే రాజకీయాల విషయంలో చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉండంవచ్చు కానీ.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఆయన చిత్తుశుద్ధిని ఇతర పార్టీల నేతలు కూడా శంకించరు. రాజకీయాలకు.. అభివృద్ధికి ఎప్పుడూ ముడిపెట్టలేదు. చేయాల్సిన పని చేస్తూనే… ఆయన రాజకీయంగా ముందుకెళ్తున్నారు.

కేసీఆర్ రాజకీయ జీవితంలో ప్రతీ పుట్టిన రోజుకూ ఓ టాస్క్ ఉంటుంది. ఎప్పటికప్పుడు అది సవాల్ గానే ఉంటుంది. దాన్ని ఆయన సింపుల్‌గా అధిగమిస్తూ వస్తున్నారు. ఈ పుట్టిన రోజుకు ఆయన ఒకటి కంటే ఎక్కువ టాస్కులు ఉన్నాయి . ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో పాటు .. బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాల్సి ఉంది. వచ్చే పుట్టినరోజు నాటికి ఆయన మూడో సారి సీఎంగా పదవిలో ఉంటే… జాతీయ రాజకీయాల్లలో ఆయన సూపర్ స్టార్‌గానే ఉంటారనడంలో సందేహం లేదు. ఈ ఫీట్ ఆయన సాధించగలరు కూడా !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close