మోహన్ లాల్ గిఫ్ట్ అందుకున్న తారక్..!

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నుండి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గిఫ్ట్ అందుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటిస్తున్నారు. నాన్నకు ప్రేమతో తర్వాత నటిస్తున్న జూనియర్ సినిమాలో మోహన్ లాల్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని తెలిసిందే. ఇప్పటికే వీరి మధ్య సన్నివేశాలు షూట్ చేయడం జరుగుతుంది. అయితే షూటింగ్ టైంలో మోహన్ లాల్ తో మంచి పరిచయం ఏర్పడ్డ ఎన్టీఆర్ కు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడట మోహన్ లాల్.

ఏప్రిల్ 14న మలయాళీ నూతన సంవత్సర సందర్భంగా తన హీరోకి అక్కడ మాత్రమే తయారు చేసే స్వీట్, వెండి కృష్ణుడి విగ్రహాన్ని తారక్ కు బహుమానంగా ఇచ్చాడట మోహన్ లాల్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న జనతా గ్యారేజ్ ను అనుకున్న రిలీజ్ డేట్ ఆగష్టు 12 కల్లా ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మరోసారి జూనియర్ విశ్వరూపాన్ని చూడొచ్చని చిత్రయూనిట్ చెబుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close