‘అందరి సహకారం’ అడిగే హక్కు జగన్‌ కుందా?

మన ఒకరినుంచి ఏం ఆశిస్తున్నామో.. ఇతరుల విషయంలో మనం అదే తరహాలో స్పందించాలనేది పెద్దలు చెప్పే నీతి. ఈ విషయం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డికి తెలియదని మనం అనుకోలేం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఆయన ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోతున్నారు. ఒకే అంశం మీద తాను తలచుకున్నడు ఇతరులు ఎలా స్పందించాలని ఆయన కోరుకుంటున్నారో… ఇతరులు వ్యవహరించినప్పుడు తాను అదే విధంగా స్పందించలేదనే సంగతిని మరచిపోతున్నారు. అవును ఇదంతా ఇప్పుడు జగన్మోహనరెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చేయబోతున్న నిరశన దీక్ష గురించి.

పాలమూరు ప్రాజెక్టుల వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఎవరూ కాదనరు. దీనిని జగన్‌ మళ్లీ శనివారం నాడు చాలా విపులంగా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కళ్లు తెరిపించేందుకే ఈ దీక్ష అని ఆయన ప్రకటించారు. ”నేను చెబుతున్న దాంట్లో తప్పుంటే సరిదిద్దుకుంటాను. తప్పు లేదంటే దీక్షకు అందరూ సహకరించాలి” అంటూ జగన్‌ ఇతర పార్టీల నాయకులు అందరికీ విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. దీక్షకు కూర్చునే ఏ నాయకుడు అయినా ఇలా అన్ని పార్టీల మద్దతును కోరుతారు. తద్వారా.. తాము అందరితో కలసి మెలిసి పోరాడడానికి ఓపెన్‌గా ఉన్నాం అనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.

కానీ వాస్తవం ఏంటంటే.. ‘ఓపెన్‌’గా ఉండడం అనేది తాము దీక్షకు కూర్చుని ఇతరులను వచ్చి మద్దతివ్వమనడంలో మాత్రమే ఉంటే సరిపోదు. ఇతరులు దీక్షకు కూర్చున్నప్పుడు కూడా తాము అంతే ‘ఓపెన్‌’గా వారికి మద్దతిచ్చినప్పుడే అది నిరూపణ అయ్యేది.

ప్రస్తుతం పాలమూరు విషయానికే వస్తే.. ఆ ప్రాజెక్టు వల్ల ఏపీకి నష్టం జరుగుతుందనడంలో సందేహం లేదు. ఆ విషయంమీద కాంగ్రెస్‌ పార్టీ కూడా చాలా కాలంనుంచి పోరాడుతున్నది. కొన్ని రోజుల కిందటే ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో.. మహాధర్నా కూడా నిర్వహించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనుంచి ఆ ధర్నాకు మద్దతుగా ఎవ్వరూ నిలబడలేదు. ధర్నా కాంగ్రెస్‌ పార్టీది గనుక, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని, తాను మద్దతు ఇవ్వడం వలన వారు బావుకునేది ఏమీ లేదని తెలిసి కూడా.. వారికి మద్దతు ఇవ్వడానికి వైకాపా ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు తాను దీక్షకు కూర్చుంటుండగా.. తన సంకల్పానికి అందరూ కలిసి మద్దతు ఇవ్వాలని జగన్‌ కోరుతున్నారు.

ఇతరులకు సహకరించే అలవాటు తనకు లేనప్పుడు.. తనకు ఇతరులు సహకరించాలని కోరే అధికారం, నైతిక హక్కు జగన్మోహనరెడ్డికి ఉంటుందా? అని ఇప్పుడు జనం ప్రశ్నిస్తున్నారు. ఈ కోణంలోంచి ఆలోచనను జగన్‌ అర్థం చేసుకోగలరో లేదో మరి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close