ఉగ్రవాదుల్ని కశ్మీర్ కి పంపించి.. పాకిస్తాన్ కు ముప్పు తెచ్చి పెట్టిన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదు. చాలా రోజులుగా ఆయన బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అసలు ఉన్నారో లేదో తెలియడం లేదు. బారత్ దాడుల తర్వాత మనీర్ గురించే పాకిస్తాన్ లో ఎక్కువగా చర్చ జరిగింది. పాకిస్తాన్ ను యుద్ధంలోకి నెడుతున్న ఈ పెద్ద మనిషి..దాడులు ప్రారంభమయ్యాక ఎక్కడున్నారని అందరూ ప్రశ్నించడం ప్రారంభించారు. కానీ ఆయన ఆచూకీ మాత్రం తెలియలేదు.
దాదాపుగా పది రోజుల కిందట ప్రధాని షాబాజ్ షరీఫ్ పాల్గొన్న ఓ సమావేశంలో మునీర్ కనిపించారని పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం ఓ ఫోటో విడుదల చేసింది. అది నిజమే అనుకున్నా…. ఆయన అప్పట్నుంచి అడ్రస్ లేరు. ఆయన సురక్షిత ప్రాంతానికి తరలిపోయారన్న చర్చ జరుగుతోంది. అది దేశంలోనా.. విదేశంలోనా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. పాకిస్తాన్ ఆర్మీ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. త
బలూచిస్తాన్లో రోజుకు పది నుంచి ఇరవై మంది సైనికుల్ని.. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఊచకోత కోస్తోంది. ఆప్ఘన్ సరిహద్దుల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కశ్మీర్ వైపు నుంచి ముప్పు తెచ్చుకున్నారు. కనీసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని కూడా ఆపలేకపోతున్నారు.. ఇక భారత్ ను ఆపడం అనేది దాదాపుగా అసాధ్యం. ఈ విషయంపై క్లారిటీ రావడంతో మునీరా ఒత్తిడికి గురై కనిపించకుండా పోతున్నారని అంటున్నారు. భారత్ పై ఉగ్రదాడులతోనే సమాధానం చెబుతామని ఆయన అండర్ గ్రౌండ్ లో కుట్రలు చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కశ్మీర్ విషయంలో మునీర్ చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన కుట్రల్ని భారత్ అంత తేలికగా మర్చిపోయే అవకాశం ఉండదు. ఈ భయంతోనే ముందుగానే ఆయన కుటుంబాన్ని లండన్ కు పంపించారు. తర్వాత ఆయన వారితో చేరారా.. బంకర్ లో దాక్కుని కుట్రలు చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.