ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బాలకృష్ణ ‘అఖండ 2’ టీజర్ వచ్చేసింది. బాలయ్య మార్క్ యాక్షన్, డైలాగ్స్, బోయపాటి మార్క్ టేకింగ్, తమన్ పవర్ ఫుల్ మ్యూజిక్ తో టీజర్ అదిరిపోయింది. టీజర్ మంచుకొండల్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలైయింది.
”నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా..’అంటూ అఘోర పాత్రలో బాలయ్య చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్ గా వుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ లో మెడపై కత్తిని తిప్పుకుంటూ రావడం, శత్రువులు రక్తం మంచుకొండల్లో పారడం బోయపాటి మార్క్.
బాలయ్య లుక్ ని ఇంకాస్త ఫెరోషియస్ గా డిజైన్ చేశారు. బాలయ్య హై ఎనర్జీతో కనిపించారు. తమన్ అందించిన నేపధ్య సంగీతం యాక్షన్ ని మరింత ఎలివేట్ చేసింది. విజువల్స్ లో క్యాలిటీ కనిపించింది. అఖండ కంటే పెద్ద స్కేల్ లో సినిమా తీశారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. మొత్తనికి టీజర్ సినిమాపై అంచనాలని పెంచింది. ఈ దసరాకి సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.