ఇప్పుడు కాస్త ఆర్థికంగా స్థిరపడిన వారు ఇల్లు కొనుగోలు చేయాలంటే.. విల్లా కొనుగోలుకే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే భారీ ఖర్చుతో కొనుగోలు చేసి అందులోకి వెళ్లిన తర్వాతనే అసలు సమస్యలు తెలుస్తాయి. అలాంటివి కొన్ని.
విల్లా కౌంటీల్లో నిర్వహణ ఛార్జీలు సాధారణంగా అపార్టుమెంట్ల కంటే ఎక్కువగా ఉంటాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్, గార్డెన్స్, సెక్యూరిటీ సేవల నిర్వహణ కోసం నెలకు ఐదు వేల నుంచి ఇరవై వేల వరకూ ఖర్చవుతుంది. అదనంగా, వ్యక్తిగత విల్లా నిర్వహణ కోసం మరింత ఖర్చు అవుతుంది. చాలా విల్లా కౌంటీలు శివారు ప్రాంతాల్లో ఉంటాయి. ఇది ఉద్యోగస్థులకు రోజువారీ ప్రయాణ సమయాన్ని పెంచుతుంది, ట్రాఫిక్ సమస్యలు , పెట్రోల్ ఖర్చులనుపెంచుతుంది. సూపర్మార్కెట్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఆసుపత్రులు వంటి కాస్త దూరం ఉంటాయి.
విల్లాలు ఫ్లాట్ల కంటే ఖరీదైనవి. బ్యాంక్ లోన్లు , EMIలు దీర్ఘకాలిక ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తాయి. విల్లా కౌంటీలు ప్రైవసీని అందిస్తాయి, కానీ ఇది కొన్నిసార్లు సామాజిక ఒడిడుడుకులకు దారితీస్తుంది. ఫ్లాట్ కమ్యూనిటీలతో పోలిస్తే, విల్లా కౌంటీలలో పొరుగువారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇరుగుపొరుగు వారు గొడవలు పడేవారు అయితే ఇక నరకమే కనిపిస్తుంది. కమ్యూనిటీలో వచ్చే సమస్యలకు మున్సిపాలిటీ బాధ్యత వహించదు. కమ్యూనిటీనే చేసుకోవాలి. చివరికి కరెంట్ పోల్స్.. ట్రాన్స్్ఫార్మర్లను కూడా కమ్యూనిటీనే చేసుకోవాలి. రోడ్ల మెయిన్టనెన్స్ ఖర్చు కూడా అందరిదే.
ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో అన్న పేరు కానీ .. చాలా వాటీల్లో గోడకు గోడకు మధ్య గ్యాప్ లేకుండానే ఇళ్లను నిర్మిస్తున్నాయి. 150 గజాల ఇళ్లు నిర్మిస్తున్నారు. దీని వల్ల పెద్దగా స్పేస్ ఉండదు. ప్రైవసీ కూడా తక్కువగానే ఉంటుంది. ఇంటి ముందు కార్లు పార్క్ చేయడం వల్ల సమస్యలు వస్తూంటాయి. ఇప్పుడు అందరికీ గేటెడ్ కమ్యూనిటీ జీవనం కొత్తగా ఉంటుంది కాబట్టి.. ప్రిఫర్ చేస్తూంటారు. అందులో దిగిన తర్వాతే సమస్యలు తెలుస్తూంటాయి. అన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం బెటర్ .