లిక్కర్ స్కామ్లో నగదును హ్యాండిల్ చేసిన కింగ్ పిన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారాలు ఆధారాలతో బయటకు వస్తూంటే ఆయన మాత్రం రెచ్చిపోతున్నారు. జైలు నుంచి కస్టడీకి తీసుకునే సమయంలో.. గేటు దగ్గర నుంచి పోలీస్ వాహనంలోకి ఎక్కించేలోపే అరిచేస్తున్నారు. మామూలుగా కాదు.. అంతు చూస్తానని.. తనతో పెట్టుకున్నారని హెచ్చరిస్తున్నారు. ఓ వైపు పోలీసులు లాక్కెళ్తూంటే….తాను వదిలి పెట్టనని ఆయన బెదిరింపులకు దిగడం కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది. కానీ చెవిరెడ్డి బెదిరిపుల మీదనే ఎక్కువగా రాజకీయాలు చేస్తూంటారు. అధికారుల్ని.. పోలీసుల్ని.. అందర్నీ బెదిరించడమే తన ఆయుధం అనుకుంటారు.
లిక్కర్ స్కామ్ బయటపడక ముందు చాలా కేసులు ఆయనపై నమోదయ్యాయి. కానీ అరెస్టులు చేయలేదు. అప్పట్లో ప్రతీ దానికి ప్రెస్మీట్ అరెస్టులు చేసుకోండి అని సవాల్ చేసేవారు. తీరా అరెస్టు చేసిన తర్వాత బయటకు వచ్చి.. మీడియా కనిపిస్తే గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల నగదును లారీలో తీసుకు వస్తూ ఆయన లెఫ్ట్, రైట్ హ్యాండ్స్ దొరికిపోయారు. వారిని ఇండోర్లో పట్టుకుని పోలీసులు తీసుకు వస్తున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి కస్టడీకి వెళ్లారు.
ఆధారాలు ముందు పెట్టి పోలీసులు తమదైన శైలిలో సమాచారం రాబడతారు. డబ్బుల తరలింపులో, బ్లాక్ మనీ రాజకీయాలు చేయడంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు అవన్నీ బయటపడుతూండే సరికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బెదిరిస్తున్నారు. కానీ ఈ చట్టాలు, వ్యవస్థలు బెదిరింపులకు లొంగవని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. మరో వైపు ఇదే లిక్కర్ కేసులో ఆయన కొడుకు కూడా జైలుకెళ్లబోతున్నాడు. ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఆయన విచారణకు హాజరు కాకుండా డుమ్మాకొడుతున్నారు..