వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సపోర్టు చేస్తామని ప్రకటిస్తున్న సమయంలోనే .. ఆ పార్టీకి చెందిన ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో సమావేశం అయ్యారు. సమావేశం తర్వాత ఆయన తాను పార్టీ మారడం లేదని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పుకొచ్చారు. కానీ ఆయన మర్యాదల వెనుక చాలా కథ ఉందని ఢిల్లీ రాజకీయవర్గాలు చెబుతున్నాయి. జగన్ రెడ్డి ఆడుతున్న డబుల్ గేమ్‌లో భాగంగానే ఇదంతా జరుగుతోందని భావిస్తున్నారు.
అరెస్టు భయంతోనే బీజేపీకి మద్దతు
బీజేపీకి జగన్ రెడ్డి మద్దతు వెనుక ఉన్నది అభిమానం కాదు. తనపై ఉన్న కేసులు, చేసిన తప్పుడు పనుల నుంచి రక్షణ లభిస్తుందన్న కారణంగానే మద్దతు పలుకుతున్నారు. ఆ విషయం బీజేపీ పెద్దలకూ తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు పలికారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఏ బిల్లులు వచ్చినా బీజేపీకి సపోర్టు చేస్తున్నారు. టీడీపీ, జనసేనలతో కలిసి బీజేపీ తనను పాతాళంలోకి పడేసిందని తెలిసినా అందుకే మద్దతు పలుకుతున్నారు.
ఓ వైపు కాంగ్రెస్ తోనూ సత్సంబంధాలకు ప్రణాళికలు
జాతీయ స్థాయిలో తాను ఒంటరిగా మిగిలిపోకూడదని .. రేపు తనను అరెస్టు చేస్తే ఎవరైనా మద్దతుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ ఆయన స్వార్థపూరిత రాజకీయాల కారణంగా ఒక్కరంటే ఒక్క రు కూడా అయ్యో అనే పరిస్థితి లేదు. అలా చేసుకుంది జగత్. ఏడాది కిందట ఢిల్లీలో ధర్నా పెడితే ఇండీ కూటమి పార్టీలన్నీ వచ్చి మద్దతు పలికాయి. దాన్ని జగన్ ..బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి వాడుకుంది. కేసుల్ని ఆలస్యం చేసుకునేందుకు వాడుకుంది. అందుకే ఇక ఎవరూ మద్దతిచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకే తన పరిస్థితిని వివరించి.. తాను కాంగ్రెస్ కూటమి వైపు సరైన సమయంలో వస్తానని రాయబారం పంపినట్లుగా చెబుతున్నారు.
ఎవరూ నమ్మలేని .. నిజాయితీ లేని జగన్ రాజకీయాలు
రాజకీయాల్లో ఎంతో కొంత వ్యక్తిత్వం కాపాడుకోవాలి. ఓ విధానం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటానని నిరూపించుకోవాలి. లేకపోతే మిత్రులంటూ ఉండరు. తన బలమే కింగ్ అని అనుకుంటే.. రేపు కింద పడిపోతారు. రాజకీయాల్లో ఎంత మందిని కలుపుకుంటే అంత బలం, కానీ జగన్ రెడ్డి అందర్నీ వాడుకోవాలనుకుంటారు. అక్కడే సమస్య వస్తోంది. క్యారెక్టర్ లేని రాజకీయాలు చేయడంతో నిండా మునిగిపోతున్నారు.