ఈ ఇంటెలిజెన్స్ సినిమాల్లో చూపిస్తే బాగుంటుంది వర్మా

శివ సినిమాతో సెన్సేషన్‌కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు వర్మ. ఆ తర్వాత కూడా ఆయన తీసిన సినిమాలలో చాలా భాగం అద్భుతమనిపించాయి. బాలీవుడ్‌‌ని కూడా తన వర్క్‌తో ఆశ్ఛర్యపరిచాడు. తొంభై శాతం మంది డైరెక్టర్స్ కలలో కూడా ఊహించలేనంత సక్సస్‌ని సాధించిన వర్మ…ఆ తర్వాత నుంచి మాత్రం ‘ఈ వర్మకు ఏమైంది?’ అని కామెడీగా మాట్లాడుకునేలా చేస్తున్నాడు. ఒకప్పుడు సినిమా మేకింగ్‌తో సంచలనాలు సృష్టించిన వర్మ రెగ్యులర్‌గా వార్తల్లో కనిపించేవాడు.

ఇప్పుడు కూడా వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాడు. సంచలన వార్త అవుతూ ఉన్నాడు. అయితే తన వర్క్‌తో కాదు, మాటలతో. అది కూడా ఎడ్డెం అంటే తెడ్డెం అనే రకం మాటలతో. వర్మ మేథస్సుని తక్కువ అంచనా వేసే సాహసం అయితే ఎవ్వరూ చేయలేరు. తెలివి తక్కువగా చేస్తున్నాడని చెప్పలేం. కానీ పబ్లిసిటీ కోసం చేస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. లేకపోతే జనాలతో గేమ్స్ ఆడుకుంటున్నానన్న భ్రమల్లో ఉన్నాడేమో తెలియదు. ఇండియన్స్ అందరూ సింధుని అభినందిస్తుంటే, మీడియా మొత్తం కూడా సింధు గురించి మాట్లాడుతుంటే వర్మకు చిరాకొచ్చినట్టుంది. నా గురించి పట్టించుకోరేంటి అనుకున్నాడు. అందరూ సింధును పొగుడుతున్నారు కాబట్టి నేనూ పొగిడితే పెద్దగా పబ్లిసిటీ రాదు అనుకున్నాడు. శోభా డేను ఫాలో అయిపోయాడు. ప్రశంశలు కురిపించిన వాళ్ళెవ్వరికీ కూడా శోభా డేకు వచ్చినంత పాపులారిటీ రాలేదు మరి. అలాగే చిరంజీవి ఫస్ట్ లుక్ గురించి, టీజర్ గురించి విమర్శించి ఉంటే మరీ ఎక్కువ పబ్లిసిటీ వచ్చి ఉండేది కాదు. ‘కత్తి’ని స్టార్ట్ చేయకముందు నుంచీ వర్మ చేస్తున్నవి విమర్శలే కాబట్టి అంత ఇంపార్టెన్స్ రాదు. అందుకే పిచి పిచ్చిగా పొగిడేశాడు. మా గురువుగారు సెటైర్స్ ఆ విధంగా వేశాడు అని రామ్ గోపాల్ వర్మ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కి అనుమానం వచ్చేంతలా పొగిడేశాడు. క్రియేటివ్, టాలెంటెడ్ డైరెక్టర్ వర్మగారూ… ఇలాంటి తెలివితేటలన్నీ వర్క్ విషయంలో చూపించండి. అప్పుడు ఇంతకంటే ఎక్కువ పబ్లిసిటీనే వస్తుంది అన్నది మెజారిటీ అభిప్రాయం. వినే ఛాన్సుందంటారా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close