డీజే క్లైమాక్స్ ఛేంజ్‌??

దిల్‌రాజు సినిమా అంటే ఆయ‌న హ్యాండ్ ఉండాల్సిందే. ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా స‌రే.. దిల్‌రాజు సూచ‌న‌ల్ని శిర‌సా వ‌హించాల్సిందే. ఎందుకంటే రాజుగారి జ‌డ్జిమెంట్ అలాంటిది. అల్లు అర్జున్ – హ‌రీష్ శంక‌ర్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న‌ డీజే (దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌) ఆయ‌న సంస్థ నుంచి వ‌స్తున్న సినిమానే. ఈ సినిమా విష‌యంలో రాజుగారి సూచ‌న‌లు చాలా వ‌ర‌కూ అమ‌ల‌య్యాయ‌ట‌. మ‌రీ ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ విష‌యంలో దిల్‌రాజు మార్పులూ చేర్పులూ సూచించార‌ని వినికిడి. హ‌రీష్ శంకర్ రాసుకొన్న క్లైమాక్స్ మ‌రీ హెవీగా అనిపించించింద‌ట‌. దాన్ని లైట‌ర్ వేలో మార్చుకుర‌మ్మ‌న్నాడ‌ట దిల్‌రాజు.

దిల్‌రాజు సూచ‌న‌లు అమ‌లు చేస్తూ హ‌రీష్ ఈ క్లైమాక్స్‌ని బాగా మౌల్డ్ చేశాడ‌ని టాక్‌. ముందు అనుకొన్న క్లైమాక్స్ కంటే.. తీసిందే బాగుంద‌ట‌. అవుట్ పుట్ విష‌యంలో అల్లు అర్జున్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. డీజే జూన్ 23న విడుద‌ల కాబోతోంది. అనుకొన్న స‌మ‌యానికే ఈ సినిమా ప‌నుల‌న్నీ పూర్త‌వుతున్నాయి. ప్ర‌చారానికి కావాల్సినంత స‌మ‌యం దొరికింది. అందుకే… డీజే ప‌బ్లిసిటీని ఓ రేంజ్‌లో చేయాల‌ని బ‌న్నీ, దిల్‌రాజు భావిస్తున్నార‌ని తెలుస్తోంది. నెల రోజుల ముందు గానే.. డీజే ప్ర‌మోష‌న్ల‌కు రిబ్బ‌న్ క‌టింగ్ ప‌డిపోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close