కేశ‌వ ట్రైల‌ర్ : కూల్‌గా మ‌ర్డ‌ర్ చేసేశాడు

డిఫ‌రెంట్ క‌థ‌ల్ని ఎంచుకొంటూ విజ‌యాలు సాధిస్తున్నాడు నిఖిల్‌. స్వామి రారా నుంచి… సూర్య వ‌ర్సెస్ సూర్య వ‌ర‌కూ నిఖిల్ ఖాతాలో విజ‌యాన్ని తెచ్చిపెట్టిన సినిమాల‌న్నీ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో వ‌చ్చిన‌వే. శంక‌రాభ‌ర‌ణంతో డిజాస్ట‌ర్‌ని మూట‌గ‌ట్టుకొన్న నిఖిల్‌.. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేశాడు. నిఖిల్ తాజా చిత్రం ‘కేశ‌వ‌’ ఇప్పుడు విడుద‌ల‌కు సిద్దమైంది. స్వామి రారా కాంబోలో తెర‌కెక్క‌డం వ‌ల్ల ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. దానికి త‌గ్గ‌ట్టు ఈరోజు (శ‌నివారం) విడుద‌ల చేసిన ట్రైల‌ర్ కూడా ఓ రేంజ్‌లో ఉంది. టూకీగా ఒక్క డైలాగ్‌లోనే క‌థ చెప్పేశాడు సుధీర్ వ‌ర్మ‌. ఇదో రివైంజ్ స్టోరీ. హీరో త‌న ప‌గ‌ని చాలా కూల్‌గా తీర్చుకోవాలి. ఎందుకంటే అత‌నికో విచిత్ర‌మైన స‌మ‌స్య ఉంది. ఎడ‌మ‌వైపున ఉండాల్సిన గుండె కుడివైపున ఉంది. కాస్త ఆవేశ ప‌డినా, టెన్ష‌న్ వ‌చ్చినా ప్రాణం పోతుంది. అందుకే ఏదైనా కూల్‌గా చేయాలి. ఆఖ‌రికి మ‌ర్డ‌ర్‌తో స‌హా. ఇలాంటి విచిత్ర‌మైన జ‌బ్బు ఉన్న హీరో.. త‌న ప‌గ ఎంత కూల్‌గా తీర్చుకొన్నాడ‌న్న‌దే కేశ‌వ క‌థ‌. ట్రైల‌ర్‌ని క‌ట్ చేసిన విధానం, ఇటెన్సిటీ, టేకింగ్ ఇవ‌న్నీ.. బాగున్నాయి. ఇదే టెంపో థియేట‌ర్‌లోనూ క‌నిపిస్తే… కేశ‌వ ఆక‌ట్టుకోవ‌డం ఖాయం. ఈనెల 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.