కేరాఫ్ సూర్య టీజ‌ర్ : కేరాఫ్‌ కామెడీ

కొత్త ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు గానీ, స‌రైన ప్ర‌తిఫ‌లం అందుకోలేక‌పోతున్నాడు సందీప్ కిష‌న్‌. మొన్నామ‌ధ్య వ‌చ్చిన న‌క్ష‌త్రం కూడా బాగా దెబ్బ‌కొట్టేసింది. ఇప్పుడు కేరాఫ్ సూర్య గా రాబోతున్నాడు. నా పేరు శివ లాంటి సూప‌ర్ హిట్ అందించిన సుశీంద్ర‌న్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో కేరాఫ్ సూర్య‌పై ఆశ‌లు పెంచుకోవొచ్చ‌నిపిస్తోంది. ఇప్పుడు టీజ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ని క‌మెడియ‌న్ స‌త్య‌తో చెప్పించడం, దానికి త‌గ్గ‌ట్టుగా స‌న్నివేశాల్నిక‌ట్ చేయ‌డం.. ఆక‌ట్టుకొంది. టీజ‌ర్ ని లైట‌ర్ వేలో క‌ట్ చేయ‌డం క‌లిసొచ్చే విష‌య‌మే. సుశీంద్ర‌న్ క‌థ‌లు, పాత్ర‌లు స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. కేరాఫ్ సూర్య కూడా అలానే ఉంటుంద‌నిపిస్తుంది. కాక‌పోతే.. త‌మిళ ఛాయ‌లు టీజ‌ర్‌లోనే బ‌య‌ట‌ప‌డిపోయాయి. ఇక తెర‌పై ఏ స్థాయిలో ఉంటుందో! మెహ‌రీన్ క‌థానాయ‌క‌గా న‌టిస్తోంది. ఆమె గ్లామ‌ర్ ఈ సినిమాకి అద‌న‌పు బ‌లం.కానీ.. త‌న‌లో గ్లామ‌ర్ కోణం మాత్రం టీజ‌ర్‌లో చూపించ‌లేదు. సుశీంద్ర‌న్ సినిమాల్లో సోష‌ల్ మెసేజ్ త‌ప్ప‌కుండా ఉంటుంది. మ‌రి ఈ క‌థ‌లో ఆ మెసేజ్ ఏంట‌న్న‌ది టీజ‌ర్లో చూపించ‌లేదు. ఈమ‌ధ్య సందీప్ చేసిన సినిమాల్లో త‌ప్ప‌కుండా ఇదే ది బెస్ట్ అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : గుర్తుకొస్తున్నావయ్యా.. శేషన్ !

టీ.ఎన్.శేషన్. ఈ పేరు భారత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా స్మరించుకుంటూనే ఉన్నారు. గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆయనను మరిపించేలా మాత్రం ఎవరూ రావడం లేదు. ఎన్నికల సంఘం...

నిప్పుల కుంపటిలా తెలంగాణ..

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మరింత ముదురుతున్నాయి. భానుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులపాటు వేసవి తీవ్రత ఇలాగే ఉంటుందని.. ఎండతోపాటు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ...

రేవంత్ కు హైకమాండ్ అభినందనలు..ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును...

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close