హోటల్ బిజినెస్‌లోకి ఎంటరయిన ప్రణీత

హైదరాబాద్: తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న బాపు బొమ్మ ప్రణీత ఇటీవల కొద్దిగా టైమ్ దొరికితే చాలు సొంత ఊరు బెంగళూరుకు వెళ్ళిపోతోంది. కన్నడ సినిమాలేమైనా చేస్తోందా అంటే అదేమీ లేదు. సొంతవాళ్ళు కన్నడవారు అసలు పట్టించుకోవటంలేదని ఎప్పటినుంచో తెగ బాధ పడిపోతోంది. మరి బెంగళూరు తరచుగా ఎందుకు వెళుతోంది అని ఆరా తీస్తే అమ్మడు అసలు విషయం చల్లగా బయటపెట్టింది. ప్రణీత ఇటీవలే వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. బెంగుళూరు నగరంలో లావెల్లె రోడ్‌లోని ఒక రెస్టారెంట్‌లో భాగస్వామ్యం తీసుకుంది. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే తనకు మొదటినుంచీ ఒక క్రేజ్ అని, ఏదైనా వ్యాపారం చేపట్టాలని చూస్తుండగా, ఈ రెస్టారెంట్ ప్రతిపాదన రావటంతో వెంటనే తీసుకున్నానని చెప్పింది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెబుతూ, ‘బ్రహ్మోత్సవం’లో ముగ్గురు హీరోయిన్‌లలో ఒకరిగా చేస్తున్నానని తెలిపింది. ముగ్గురు హీరోయిన్‌లలో ఒకరిగా వేయటంపట్ల తానేమీ బాధ పడటంలేదని, మహేష్ పక్కన నటించే అవకాశం రావటమే గొప్పగా భావిస్తున్నానని చెప్పింది. పాత్ర చిన్నదా, పెద్దదా అనేది తాను చూడనని, తమిళ చిత్రం ‘మాస్‌’లో తన పాత్రకు రెండే డైలాగ్స్ ఉంటాయని, సీన్స్, మోంటేజ్ మాత్రం ఎక్కువ ఉంటుందని తెలిపింది. అన్నట్లు ఈ అమ్మడు ఇవాళ బెంగళూరులో తన బర్త్‌డే జరుపుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కుదరదన్న తెలంగాణ హైకోర్టు

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి గుడ్ న్యూస్ లు వరుసగా వినిపిస్తున్నాయి. అప్రూవర్ గా మారిన దస్తగిరి తనను జైల్లో పెట్టి.. పెద్ద ఎత్తున ప్రలోభపెట్టడమే కాకుండా......

‘ఆ ఒక్కటీ అడక్కు’ రివ్యూ: క్లాసిక్ టైటిల్ చెడ‌గొట్టారు

Aa Okkati Adakku Movie review తెలుగు360 రేటింగ్ 2.25/5 -అన్వ‌ర్‌ ఒకప్పుడు అల్లరి నరేష్ నుంచి కామెడీ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ వుండేది. తర్వాత పరిస్థితి మారింది. ఆయనపై కామెడీ కథలు సరిగ్గా...

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close