“అదానీ”కి బ్లాక్ మండే..!

నయా కుబేరుడి అవతారం ఎత్తుతున్న అదాని ఎంటర్ ప్రైజెస్ యజమాని గౌతం అదానికి సోమవారం భయంకరమైన షాక్ తగిలింది. ఆయన షేర్లు దారుణంగా పతనమయ్యాయి. స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోకపోయినప్పటికీ.. ప్రత్యేకించి ఆయన కంపెనీల షేర్లు మాత్రం పాతిక శాతం వరకూ పడిపోయాయి. ఫలితంగా.. ఒక్క రోజులో అర లక్ష కోట్లను గౌతం అదానీ కోల్పోయారు. ఇలా జరగడానికి ప్రత్యేకమైన కారణం ఉంది.

గౌతం అదాని ఇటీవలి కాలంలో వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. సంస్థల్ని టేకోవర్ చేస్తున్నారు. పోర్టుల్ని.. ఎయిర్ పోర్టుల్ని కొంటున్నారు. ఇప్పుడు సిమెంట్ పరిశ్రమపై దృష్టి పెట్టారు. అయితే ఆ పెట్టుబడులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఆయన గ్రూప్‌లో విదేశాల నుంచి పెద్ద ఎత్తున కంపెనీలు ఫండ్స్‌ను తరలిస్తున్నాయి. ఇదంతా పెట్టుబడి రూపంలో జరుగుతోంది. నిధులు తరలిస్తున్న కంపెనీల సమాచారాన్ని అదాని గ్రూప్ రహస్యంగా ఉంచింది. నిబంధనల ప్రకారం.. కచ్చితంగా విదేశీ నిధుల సమాచారాన్ని వెల్లడించాలి. లేకపోతే ఆ నిధుల్ని అందుకున్న వారి డిమ్యాట్ ఖాతాల్ని నిలిపివేస్తారు.

అదాని గ్రూప్‌కు నిధులు మూడు విదేశీ కంపెనీల నుంచి వచ్చాయి. ఆ కంపెనీలకు మారిషస్‌లోని పోర్ట్‌లూయిస్‌కు చెందిన ఒకే అడ్రస్‌ ఉంది. వీటికి ప్రత్యేక వెబ్‌సైట్లు కూడా లేవు. అంటే బ్లాక్ మనీని ఇండియా నుంచి మారిషస్ తరలించి.. అక్కడ్నుంచి పెట్టుబడుల రూపంలో ఇండియాకు తరలించారన్న అనుమానాలు ఏర్పడుతున్నాయి. నిధులు పంపిణీ చేస్తున్న కంపెనీల వివరాలు ఇవ్వకపోవడంతో అదానీ గ్రూప్‌ కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ఖాతాలను స్తంభింపజేసింది. ఇది గత నెలలోనే జరిగింది. అయితే ఇప్పుడే బయటకు వచ్చింది.

ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత … గతంలో హర్షద్ మొహతా కుంభకోణాన్ని బయట పెట్టిన సుచేతా దలాల్ అనే జర్నలిస్టు ఓ ట్వీట్ పెట్టారు. మరో హర్షద్ మొహతా తరహా కుంభకోణం వెలుగులోకి రాబోతోందని ఆ ట్వీట్ సారాంశం. ఓ వైపు.. గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు ఏడాదిలో నాలుగు వందల నుంచి వెయ్యి శాతం వరకూ పెరగడం.. మరో వైపు పెట్టుబడులకు లెక్కలు లేకపోవడంతో.. అదాని గ్రూప్ గురించే అని ఇన్వెస్టర్లు అనుకున్నారు. ఫలితంగా అదానీ గ్రూప్ అర లక్ష కోట్లు నష్టపోయింది. కోలుకుంటుందా లేదా.. అన్నది తర్వాత సంగతి కానీ..అదానీ గ్రూప్ వెనుక చాలా లొసుగులు ఉన్నాయని మాత్రం బయటకు వస్తోంది.

అయితే అదానీ గ్రూప్ మాత్రం.. ఈ ప్రచారాన్ని ఖండిస్తోంది. తమకు వస్తున్న పెట్టుబడులపై జరుగుతున్న ప్రచారం అంతా అబద్దమేనని ప్రకటన చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close