ఐశ్వ‌ర్య‌రాయ్‌కి క‌రోనా.. ఆరాధ్య‌కి కూడా

అమితాబ్ బ‌చ్చ‌న్‌, అభిషేక్ బ‌చ్చ‌న్ ల‌కు క‌రోనా సోక‌డం, ప్ర‌స్తుతం ముంబైలోని నానావ‌తీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌డం తెలిసిన విష‌యాలే. ఇప్పుడు ఐశ్వ‌ర్య‌రాయ్‌కి కూడా క‌రోనా సోకింది. కూతురు ఆరాధ్య‌కి కూడా క‌రోనా పాజిటీవ్ గా నిర్దార‌ణ అయ్యింది. అమితాబ్, అభిషేక్‌ల‌కు క‌రోనా సోక‌డంతో.. ఇంట్లో వాళ్ల‌కు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించారు. జ‌యా బ‌చ్చ‌న్‌కి నెగిటీవ్ గా తేలింది. మిగిలిన వాళ్ల ప‌రీక్షా ఫ‌లితాలు రావాల్సివుంది. ప్ర‌స్తుతం ఐశ్వ‌ర్య‌ని సైతం నానా వ‌తీ ఆసుప‌త్రికి త‌ర‌లించే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

* రేఖ సైతం..

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి రేఖ‌కి సైతం క‌రోనా సోకింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రేఖ ఇంట్లో ప‌నిచేసే సెక్యురిటీ సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. వాళ్ల‌లో కొంత‌మందికి పాజిటీవ్ గా తేలింది. దాంతో రేఖ‌కి సైతం.. క‌రోనా టెస్టులు చేయించారు. దాంట్లో పాజిటీవ్ అని తేలింద‌ని స‌మాచారం. అయితే పూర్తి వివ‌రాలు అందాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

3 రాజధానులకు 16నే ముహుర్తం..! ప్రధానికి ఆహ్వానం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగానే మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించింది. ప్రభుత్వం తరపున రాజధాని తరలింపు వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్న సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఈ మేరకు.. కేంద్ర ప్రభుత్వానికి...

మంటల్లో బెజవాడ కోవిడ్ ఆస్పత్రి..! రోగుల ప్రాణాలు పణం..!

మొన్న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగి. రోగులు మరణించిన విషయం కలకలం రేపింది. ఇప్పుడు అలాంటి ఘటనే ఏపీలో జరిగింది. విజయవాడలో.. కోవిడ్ చికిత్స ఆస్పత్రిగా వినియోగిస్తున్న స్వర్ణా...

ఆర్కే పలుకు : జగన్‌ మెడకు ఈశ్వరయ్యను చుడుతున్న ఆర్కే..!

న్యాయవ్యవస్థపై జగన్ చేస్తున్న దాడిని తనదైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు... ఆంధ్రజ్యోతి ఆర్కే చేస్తున్న ప్రయత్నానికి మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య ఆయుధాన్ని అందించారు. జస్టిస్ నరసింహారెడ్డిపై పోరాటం చేస్తున్న దళిత జడ్జి...

50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా - మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర - బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా - మిహిక‌లు...

HOT NEWS

[X] Close
[X] Close