‘బేబీ’తో హిట్ పెయిర్ అనిపించుకున్నారు ఆనంద్ దేవరకొండ- వైష్ణవీ చైతన్య. ఈ కాంబినేషన్లో ‘#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ ఆదిత్య హాసన్ ‘ఎపిక్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. నాగ వంశీ నిర్మాత. ‘ఇది శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోలాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ’ అంటూ టైటిల్ గ్లింప్స్ తో ఆసక్తిని పెంచారు. ఇప్పుడీ సినిమా టీజర్ బయటికి వచ్చింది.
ఆదిత్య(ఆనంద్) షార్ట్ ఫిలిం డైరెక్టర్, యూకే లో పరిచయమైన కడలి( వైష్ణవీ చైతన్య)తో ప్రేమలో పడతాడు. కడలి పట్టింపులున్న అమ్మాయి. సరిగ్గా ముద్దుపెట్టుకునే సమయానికి ‘మీరు ఏమిట్లు?’ అనే ప్రశ్న అడుగుతుంది. ఆ తర్వాత ఇద్దరూ మరింత దగ్గరౌతారు. మరి ఈ ప్రేమకథలో అసలు కాన్ఫ్లిట్ ఏమిటో తెరపైనే చూడాలి.
టీజర్ మంచి యూత్ ఫుల్ వైబ్ తో కట్ చేశారు. దేశం దాటినా ‘మీరు ఏమిట్లు?’ అనే డైలాగ్, ఓ రొమాంటిక్ సీన్, అందులోనే ఫ్యామిలీ కాల్.. ఇవవ్నీ టీజర్ కావాల్సిన పెప్ యాడ్ చేశాయి. ఆనంద్ దేవరకొండ- వైష్ణవీ చైతన్య జోడి చూడబుల్ గా వుంది. యూకేలో చిత్రీకరించడంతో ఫ్రెష్ టచ్ వచ్చింది. దర్శకుడు ఆదిత్య యువతని ఆకర్షించే పాయింట్ నే పట్టుకున్నాడు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం, అజీమ్ మహ్మద్ కెమరా వర్క్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ అన్నీ లావిష్ గా కుదిరాయి. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది.
