ఏప్రిల్ లో బాక్సాఫీస్ చాలా డల్ గా సాగిపోయింది. అందరి కళ్లూ మే పైనే. మేలో రావాల్సిన సిపినమాలు చాలా ఉన్నాయి. చిన్నా, మీడియం రేంజ్ సినిమాలు ఎక్కువగా వరుస కడుతున్నాయి. మే 1 నుంచే ఈ హంగామా మొదలు కాబోతోంది. 1న రెండు సినిమాలు రాబోతున్నాయి. గాయపడ్డ సింహం, జైట్లీ విడుదలకు సిద్ధమయ్యాయి. రెండూ ఫన్ సినిమాలే.
తరుణ్ భాస్కర్ హీరోగా రూపొందించిన సినిమా ‘గాయపడ్డ సింహం’. ట్రంప్ ని ఈ సినిమా కోసం ట్రంప్ కార్డ్ గా వాడేస్తున్నారు. ట్రంప్ డూప్ తో కొన్ని సీన్లు కూడా తీశారు. ప్రమోషన్స్ లోనూ ట్రంప్ కనిపిస్తున్నాడు. అలా.. ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో చిత్ర బృందం సక్సెస్ అయ్యింది. దానికి తోడు శ్రీవిష్ణు కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ట్రైలర్ లో తన ఎంట్రీ సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఈ సినిమా హిట్టయితే.. శ్రీవిష్ణుతో సీక్వెల్ కరూడా ప్లాన్ చేస్తున్నార్ట. జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించడం, మరో దర్శకుడు పవన్ సాధినేని సమర్పకుడిగా వ్యవహరించడంతో ఈ సినిమాపై నమ్మకాలు కలుగుతున్నాయి.
సత్య హీరోగా రూపొందించిన ‘జెట్లీ’ కూడా ఈ వారమే వస్తోంది. ‘మత్తువదలరా’ సిరీస్ తో ఆకట్టుకొన్న రితీష్ రానా ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ చాలా సరదాగా సాగుతోంది. ప్రెస్ మీట్లలోనూ నవ్వించేస్తున్నారు. ఇదే జోరు సినిమాలోనూ చూపిస్తే హిట్టు గ్యారెంటీ అనిపిస్తోంది. సత్య రంగంలోకి దిగి థియేటర్ల దగ్గర టికెట్లు అమ్మడంతో మరింత పబ్లిసిటీ వచ్చింది. మైత్రీ మూవీస్ నుంచి వస్తున్న సినిమా ఇది. కాబట్టి క్వాలిటీ పరంగా, ప్రమోషన్ పరంగా బెంగ పడాల్సిన పనిలేదు. టీజర్, ట్రైలర్ లో ఫన్ బాగా వర్కవుట్ అయ్యింది. స్క్రీన్ పై కూడా అది కనిపిస్తే మంచి ఫలితమే వస్తుంది.
కామెడీ జోనర్ అనేది ఎవర్ గ్రీన్. కాస్త నవ్వించినా కాసులు కురుస్తుంటాయి. మరి ఈ రెండు సినిమాలు ఏ మేరకు నవ్విస్తాయో… మే బాక్సాఫీసుకు ఎలాంటి ఆరంభాన్ని ఇస్తాయో చూడాలి.
