ఆసియా క‌ప్‌: ఇండియా ఇంటికి

త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా చేతులు ఎత్తేసింది. వ‌రుస‌గా రెండో ప‌రాభ‌వంతో.. ఆసియా క‌ప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈరోజు శ్రీ‌లంక‌తో జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి.. ఇంటి దారి ప‌ట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌కు 172 ప‌రుగులు చేసింది. అందుకు బ‌దులుగా బ్యాటింగ్ కి దిగిన శ్రీ‌క‌లం ల‌క్ష్యాన్ని మ‌రో బంతి మిగిలి ఉండ‌గానే ఛేధించింది. అంత‌కు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు కీల‌క‌మైన వికెట్లు (రాహుల్‌, విరాట్‌) కోల్పోయింది. అయితే రోహిత్ శ‌ర్మ (41 బంతుల్లో 72) బాధ్య‌తాయుత‌మైన బ్యాటింగ్ తో ఇన్నింగ్స్ ని కుదుట ప‌రిచాడు. సూర్య కుమార్ యాద‌వ్ (34) మిన‌హాయిస్తే మ‌రెవ్వ‌రూ బ్యాట్ ఝులిపించ‌లేక‌పోయారు. చివ‌ర్లో వేగంగా ప‌రుగులు సాధించ‌డంలో భార‌త్ విఫ‌ల‌మైంది.

శ్రీ‌లంక ఓపెన‌ర్లు నిసాంక (52), మెండీస్ (57) తొలి వికెట్‌కు మెరుపు వేగంతో 97 ప‌రుగులు జోడించారు. ఆ త‌ర‌వాత చాహ‌ల్ వ‌రుస‌గా 3 వికెట్లు తీసి భార‌త శిబిరంలో ఆశ‌లు నింపాడు. ఆఖ‌రి 12 బంతుల్లో 21 ప‌రుగులు అవ‌స‌ర‌మైన వేళ భువ‌నేశ్వ‌ర్ కుమార్ 19 వ ఓవ‌ర్లో 14 పరుగులు ఇవ్వ‌డంతో… శ్రీ‌లంక విజ‌యం సునాయాస‌మైంది. చాహ‌ల్ త‌ప్ప భార‌త బౌల‌ర్లు ఎవ‌రూ రాణించ‌క‌పోవ‌డంతో… 172 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ కాపాడుకోలేల‌క‌పోయింది. సూప‌ర్ 4లో భార‌త్ త‌న చివ‌రి మ్యాచ్ ఆఘ్గ‌నిస్థాన్ తో త‌ల‌ప‌డుతుంది. ఆ మ్యాచ్ లో గెలిచినా భార‌త్ కు ఉప‌యోగం లేన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వావ్… బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మాములుగా లేదుగా!

తాజ్ మ‌హాల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలిలెవ‌రోయ్... అన్న మాట చాలా సంద‌ర్బాల్లో గుర్తుకొస్తుంది. కిందిస్థాయిలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారిని గుర్తించ‌టం, గౌర‌వించ‌టం కార్పోరేట్ వ్య‌వ‌స్థ‌లో మూల‌న ప‌డిపోయింది. కానీ, ఈసారి ఐపీఎల్ లో...

మెగా మ‌న‌సు చాటుకొన్న చిరు!

చిరంజీవి మ‌రోసారి త‌న ఉదార‌త చాటుకొన్నారు. అనారోగ్యంతో బాధ ప‌డుతున్న సినీ పాత్రికేయుడికి త‌న అభ‌యహ‌స్తం అందించారు. మీడియా స‌ర్కిల్‌లో ఉండేవాళ్ల‌కు జ‌ర్న‌లిస్టు ప్ర‌భు ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తే. చిరంజీవితో కూడా ఆయ‌న‌కు...

వైన్స్ ఓన‌ర్స్ Vs బార్ ఓన‌ర్స్… తెలంగాణ‌లో కొత్త పంచాయితీ

మూడు పువ్వులు... ఆరు కాయ‌లుగా సాగే వ్యాపారాల్లో మ‌ద్యం బిజినెస్ కూడా ఒక‌టి. తెల్లారి లేస్తే లెక్చ‌ర్లు ఇచ్చే పొలిటిక‌ల్ లీడ‌ర్స్ నుండి గ‌ల్లీ లీడ‌ర్ల వ‌ర‌కు, కార్పోరేట్ సంస్థ‌లు ఇలా...

మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మెగాస్టార్

రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆయన తాజాగా ఓ జర్నలిస్టుకు తన వంతు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close