బండ్ల గ‌ణేష్ అరెస్టు

న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ని బంజారా హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న‌పై 420, 448, 506 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. ప్ర‌ముఖ నిర్మాత‌, పీవీపీ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కే గ‌ణేష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ‌తంలో ఎన్టీఆర్ తో `టెంప‌ర్‌` అనే చిత్రాన్ని నిర్మించాడు గ‌ణేష్‌. ఆ స‌మ‌యంలో పీవీపీ నుంచి దాదాపు 7 కోట్లు ఫైనాన్స్‌గా తీసుకున్నారు. ఆ బాకీ చెల్లించ‌మ‌ని అడిగినందుకు గ‌ణేష్ త‌మ‌పై దాడిని పాల్ప‌డ్డాడ‌ని ఇది వ‌ర‌కే పీవీపీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మంగ‌ళ‌వారం రాత్రి జూబ్లీహిల్స్ లోని పీవీపీ ఇంట్లో గ‌ణేష్ త‌న అనుచ‌రుల‌తో క‌లిపి వీరంగం చేశాడ‌ని, త‌న‌ని బెదిరించాడ‌ని తాజాగా మ‌రోసారి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు పీవీపీ. అయితే మంగ‌ళ‌వారం రాత్రి నుంచి గ‌ణేష్ ప‌రారీలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కొంత‌సేప‌టి క్రిత‌మే పోలీసులు గ‌ణేష్‌ని అదుపులోకి తీసుకున్నారు.అనంత‌రం బంజారా హిల్స్ ఏసీపీ కార్యాల‌యానికి గ‌ణేష్‌ని త‌ర‌లించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close