కరువుకు కాంగ్రెస్‌ను నిందిస్తూ బీఆర్ఎస్ ఓట్ల వేట !

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది. అయితే కరువు వొచ్చిందని దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణమని నిందిస్తూ.. బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్తోంది. కేసీఆర్ నల్లగొండ జిల్లాలో పర్యటించారు . ఓ రైతుకు ఐదు లక్షల సాయం కూడా ఇచ్చారు. ఆయన కాంగ్రెస్‌దే కరువు పాపమని నిందించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే.. పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్సే కారణని నిందిస్తూ.. వీడియోలు మీద వీడియోలు చేస్తున్నారు.

అయితే నీరు ఎందుకు అందుబాటులో లేదన్న అంశాన్ని మాత్రం బీఆర్ఎస్ ఎక్కువ చర్చల్లోకి తీసుకు రాకుండా.. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మరీ కాస్త అతిగా ఉన్నప్పటికీ.. వీలైనంత ఎక్కువ మందిని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఎక్కడైనా పచ్చగా ఉంటో ఫోటోలు తీసుకుని కాళేశ్వరం మహిమ అంటున్నారు. అయితే ఇంత త్వరగా కాంగ్రెస్‌ను నిందించడం అనేది రాంగ్ స్ట్రాటజీ అవుతుందనేది చరిత్ర చెప్పిన సత్యం.

ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే వర్షాలుపడలేదు. అందుకే జలాశయాలు నిండలేదు. జలాశయాలు నిండుగా ఉన్నప్పుడుకూడా కృష్టా డెల్టాకు ఇబ్బందికర పరిస్థితులు కేసీఆర్ హయాంలో ఉన్నాయి. ఆయినా బీఆర్ఎస్ కు ఇప్పుడు కరువు ఒక్కటే ఆయుధంగా కనిపిస్తోంది. ఎంత మేర ఈ కరువు రాజకీయంగా ఆదుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close