వామ్మో.. కేథ‌రిన్‌కి ఇంత టెక్కా??

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండ‌మ‌ని పెద్ద‌లు చెబుతుంటారు. మ‌న క‌థానాయిక‌ల్లో స్టార్ డ‌మ్ తెచ్చుకొన్న‌వాళ్లంతా.. మీడియా ముందు విన‌యంగానే ఉంటారు. అయితే మ‌రో ర‌కం.. క‌థానాయిక‌లున్నారు. చేతిలో ఒక్క హిట్టూ లేక‌పోయినా.. వాళ్లిచ్చే బిల్డ‌ప్పుల‌కు అంతూ పొంతూ ఉండ‌దు. కేథ‌రిన్ ఆ టైపే! తల‌తిక్క స‌మాధానాలు చెబుతూ…త‌న రూటే స‌ప‌రేటు అన్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తుంటుంది. మీడియా అంటే.. కేథ‌రిన్‌కి చిన్న‌పూపు. ఎర్ర‌బ‌స్సు స‌మ‌యంలో మీడియా ముందు నోరుజారింది కేథ‌రిన్‌. అప్ప‌ట్లో కేథ‌రిన్ ఇంట‌ర్వ్యూల‌ను మీడియా స‌స్పెండ్ చేసింది. ఇప్పుడు స‌రైనోడు ప్ర‌మోష‌న్ల‌లోనూ త‌న టెక్కు చూపించే ప్ర‌య‌త్నం చేసింది.

ఆదివారం దిన ప‌త్రిక‌ల‌కు, వెబ్ మీడియాకు ఇంట‌ర్వ్యూలు ఇచ్చింది కేథ‌రిన్‌. పాత్రికేయులు అడిగిన ఒక్క ప్ర‌శ్న‌కూ తిన్న‌గా స‌మాధానం చెప్ప‌లేద‌ట కేథ‌రిన్‌. ”బ‌న్నీతో మీ కెమిస్ట్రీ బాగా కుదిరిన‌ట్టుంది.. అందుకే వ‌రుస‌గా మూడో సినిమా చేస్తున్నారు.” అని అడిగితే ఇంతెత్తున లేచింద‌ట‌. ”కెమిస్ట్రీ కుద‌ర‌డం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? అస‌లు కెమిస్ట్రీ అంటే ఏమిటి?” అంటూ క్లాస్ తీసుకొనే ప్ర‌య‌త్నం చేసింద‌ట‌. ‘గ్లామ‌ర్ పాత్ర‌లే చేస్తారా’ అని అడిగిన మ‌రో ప్ర‌శ్న‌కూ ఇలానే వైల్డ్‌గా రియాక్ష‌న్ ఇచ్చింద‌ట‌. ”గ్లామ‌ర్ పాత్ర‌లు నేనెక్క‌డ చేశాను? తెలిసీ తెలియ‌క మాట్లాడ‌కండి” అంటూ ఓ రేంజులో రెచ్చిపోయింద‌ట‌. ఏది అడిగినా రివ‌ర్స్‌లో స‌మాధానం చెప్పేస‌రికి పాత్రికేయులంతా విస్తుపోయార‌ట‌. మ‌రీ ఇంత గోరోజ‌నం ఉంటే ఎలా త‌ల్లీ..? అస‌లే సినిమాల్లేవు.. ఇప్పుడు ప‌బ్లిసిటీ కూడా దొర‌క‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close