ఆంధ్రప్రదేశ్‌కు కూడా కేంద్ర బృందాలు..!

వైరస్ నివారణ చర్యల్ని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర బృందాల్ని పంపాలని… కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు రోజుల్లో ఈ బృందం ఏపీకి రానుంది. నాలుగు రోజుల పాటు వైరస్ నివారణ కోసం తీసుకున్న చర్యల్ని పరిశీలించనుంది. నిజానికి కేంద్ర బృందాలను.. మెట్రో సిటీలకు మాత్రమే పంపారు. హైదరాబాద్, కోల్‌కతా, ముంబై లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి జరుగుతూండటంతో.. ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బృందాల్ని పంపారు. బెంగాల్ లాంటి చోట్ల కేంద్ర బృందాలకు… అక్కడి ప్రభుత్వాలు సహకరించకపోవడంతో… వివాదం ఏర్పడింది. మిగిలిన చోట్ల.. ఆయా ప్రభుత్వాలు… కేంద్ర బృందాలు తిరగడానికి ఏర్పాట్లు చేశాయి.

మెట్రో సిటీలు లేకపోయినప్పటికీ… ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా.. పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి చెందుతూండటంతో.. కేంద్రం.. కారణాలను పరిశీలించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు, గంటూరు, కృష్ణా జిల్లాలో వైరస్ సామాజిక వ్యాప్తి జరుగుతోందన్న అభిప్రాయాన్ని ఇప్పటికే అధికారవర్గాలు వ్యక్తం చేశాయి. ఈ దశకు వెళ్తే కట్టడి చేయడం కష్టం అవుతుంది. అదే సమయంలో… లాక్ డౌన్ అమలులో చాలా తప్పులు జరిగాయని కేంద్రానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. కాళహస్తి ఎమ్మెల్యే ర్యాలీ.. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు సాయం పేరుతో భౌతిక దూరం పాటించకుండా చేసిన కార్యక్రమాలు జాతీయ మీడియాలోనూ హైలెట్ అయ్యాయి.

కరోనాపై పోరాటానికి కేంద్రమే… పూర్తి స్థాయిలో నిధులు ఇస్తోంది. ఈ నిధులు సద్వినియోగం అవుతున్నాయో లేదో కూడా పరిశీలించాలని కేంద్రం నిర్ణయించుకుంది. తెలంగాణలో నాలుగు రోజుల పాటు పర్యటించిన కేంద్ర బృందం.. ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్లు , రెడ్ జోన్లు అన్నింటినీ పరిశీలించింది. ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. ఏపీలోనూ… క్వారంటైన్ సెంటర్లను పరిశీలించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close