ఇప్పుడు చూస్తే వరద నష్టం, కష్టం తెలుస్తుందా..!?

ఏపీలోవరద పరిస్థితిని అంచనా వేయడానికి .. నష్టాన్ని లెక్కలేయడానికి కేంద్ర బృందం వచ్చింది. ముందుగా చీఫ్ సెక్రటరీతో సమావేశమయింది. తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్తారు. కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో 3 కేంద్ర బృందాలు పర్యటిస్తాయి. ప్రభుత్వం తరపున వారికో నివేదిక అందిసతారు. అయితే ఇప్పటికి వరదలు వచ్చి .. వెళ్లిపోయి ఇరవై రోజులు అవుతోంది. దాదాపుగా సాధారణ స్థితి ఏర్పడింది. మునిగిపోయిన పంట.. నష్టపోయిన పంటను పొలాల నుంచి తొలగించి ఉంటారు. ఇప్పుడు నేరుగా క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుందన్న విమర్శ రైతు వర్గాల నుచి వస్తోంది.

సాధారణంగా వరద ఉద్ధృతి ఉన్నప్పుడే కేంద్రం ప్రత్యేక బృందాలను పంపి.. నష్టం అంచనా వేసి తక్షణ సాయం అందిస్తుంది. ఏపీ విషయంలో మాత్రం కేంద్రం చురుకుగా స్పందించలేదు. హైదరాబాద్‌కు కేంద్ర బృందాలను అప్పటికప్పుడు పంపారు. సాయం చేశారో లేదో… తర్వాతి సంగతి కనీసం.. అంచనాలను అయిన తెలుసుకున్నారు. ఏపీకి మాత్రం రెండు వారాల తర్వాత పంపారు. అదీ కూా.. తెలంగాణకు పంపారు.. ఏపీకి ఎందుకు పంపలేదన్న విమర్శలు రావడంతో.. బీజేపీ నేతలు ప్రత్యేకంగా కేంద్ర వ్యవసాయ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని.. విజ్ఞప్తి చేశారు. అప్పుడు ప్రకటన చేశారు. ఇప్పుడు బృందాలు వచ్చాయి.

రైతులకు ఏపీ సర్కార్ వైపు నుంచి ఎలాంటి సాయం అందలేదు. కనీసం ఇంత మొత్తం ఇస్తామన్న ప్రకటన కూడా చేయలేదు. ఇన్ పుట్ సబ్సిడీ వచ్చే నెలలో ఇస్తామని మాత్రమే చెబుతున్నారు. ఇప్పుడు కేంద్రం అయినా కనికరించి సాయం చేస్తుందన్న ఆశలో రైతులు ఉన్నారు. అయితే ఈ సమయంలో వరద నష్టం అంచనాకు వచ్చి.. నష్టం లేదు.. వరద ప్రభావం ఏమీ లేదనుకుంటే… నష్టపోతామని రైతులు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close