ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ శర వేగంగా సాగుతోంది. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేస్తారా, లేదా? అనే అనుమానాలూ ఉన్నాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ చిత్రబృందం ఓ సూపర్ అప్ డేట్ ఇచ్చేసింది. మే 20న ఎన్టీఆర్ – నీల్ గ్లింప్స్ రాబోతోంది. అంతే కాదు.. ఈరోజు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. 2027 జూన్ 11న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అంటే దాదాపు 14 నెలల సమయం ఉందన్నమాట.
ఈ సినిమా కోసం ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాని ఈ పేరుతోనే పిలుచుకొంటారు. దాదాపు ఈ టైటిలే ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మే 20న విడుదల చేసే గ్లింప్స్ లో `డ్రాగన్` వరల్డ్ ని పరిచయం చేయబోతున్నాడు నీల్. గ్లింప్స్ కి సరిపడా ఫుటేజీ కూడా రెడీగానే ఉంది. దానికి మెరుగులు దిద్ది వదలడమే తరువాయి. ఈ సినిమాలో కథానాయికగా రుక్మిణీ వసంతన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో హీరోయిన్ గా అలియాభట్ కనిపిస్తుందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. విలన్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడన్న వార్త కూడా బలంగా చక్కర్లు కొడుతోంది. వీటికి సంబంధించిన క్లారిటీ మాత్రం రావాల్సివుంది.
