వీవీ ప్యాట్లు, ఈవీఎంలలో తేడాలొస్తే ఈసీ ఏం చేస్తుందో చెప్పాల్సిందేనంటున్న చంద్రబాబు..!

వీవీ ప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ.. చంద్రబాబు… ప్రయత్నాలు మానలేదు. 21 పార్టీల ప్రతినిధులతో కలిసి.. సీఈసీతో సమావేశం అయ్యారు. ఈవీఎంలో పోలయిన ఓట్లకు, వీవీ ప్యాట్‌ స్లిప్పులకు మధ్య తేడా ఉంటే నియోజకవర్గంలో మొత్తం స్లిప్పులన్నీ లెక్కించాల్సిందేనన్నా. ఈవీఎంలపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన అవసరముందన్నారు. వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం తీర్పును గౌరవిస్తూనే పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. యాభై శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కిస్తేనే.. ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత వచ్చినట్టు అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం పోరాటం కొనసాగుతుందన్నారు. దీనిపై మరోసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని విపక్ష నేతలు కలిశారు.

చంద్రబాబుతో పాటు ఫరూక్అబ్దుల్లా, డి.రాజా, అభిషేక్‌మను సింఘ్వి, సీపీఎం, డీఎంకే, జేడీఎస్, టీఎంసీ, ఆర్ఎల్డీ, ఆప్‌ నేతలు ఈసీని కలిశారు. వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కింపుతో పాటు ఈవీఎంల లోపాలపై ఫిర్యాదు చేశారు. సగం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించడంపై 21 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీనిపై చంద్రబాబు సహా పార్టీల నేతలు స్పందించారు. సుప్రీం తీర్పును గౌరవిస్తూనే ఈ విషయంలో పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలనే ఉద్ధేశంతోనే వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కింపు కోరుతున్నామన్నారు చంద్రబాబు. వీవీ ప్యాట్‌ల కోసం 9వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. ఆ స్లిప్పులను లెక్కించకపోతే ఏం లాభం అని ప్రశ్నించారు.

నియోజకవర్గంలో ర్యాండమ్‌గా అయిదు వీవీ ప్యాట్ స్లిప్పులు మాత్రమే లెక్కించాలన్న సుప్రీం తీర్పును ఈసీ పాటించబోతుంది. ఈ లెక్కన 2 శాతం స్లిప్పులు కూడా లెక్కించడం లేదని కాంగ్రెస్‌ నేత, న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ కోర్టుకు తెలిపారు. వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించడానికి సిబ్బంది సరిపోరని అనడం, సమయం ఎక్కువ పడుతుందని ఈసీ చెప్పడం తప్పించుకోవడం కోసమేనన్నారు చంద్రబాబు. దీనిపై ప్రజాస్వామ్యంలో అన్ని పద్ధతుల ద్వారా పోరాటం చేస్తామన్నారు చంద్రబాబు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘విశ్వంభ‌ర‌’లో ప‌వ‌న్‌.. అంత సీన్ ఉందా?

చిరంజీవి న‌టిస్తున్న సోషియో ఫాంట‌సీ చిత్రం 'విశ్వంభ‌ర‌'. వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌. ఈ చిత్రంలో చిరంజీవి భీమ‌వ‌రం దొర‌బాబుగా, ఐదుగురు చెల్లెమ్మ‌ల‌కు అన్న‌య్య‌గా క‌నిపించ‌నున్నారు. దాదాపు 40...

రివర్స్ ప్రచారం : మేనిఫెస్టో గురించి చెప్పుకోలేని జగన్ !

అధికార పార్టీ నేతగా.. సీఎంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ ప్రచారసభల్లో ఏం చెబుతున్నారు ?. మళ్లీ గెలిస్తే ఏం చేస్తానో చెబుతున్నారా ?. తన మేనిఫెస్టో...

కడప లోక్ సభ రివ్యూ : కొంగు సెంటిమెంట్ ఫలిస్తే సంచలనమే !

కడప లోక్ సభ బరిలో " ఎలగైనా అవినాష్ రెడ్డే గెలుస్తారు " అని వైసీపీ నేతలు ధీమాగా చెప్పుకుంటున్నారు. ఎలాగైనా అనే పదం వాడతూ వ్యక్తం చేస్తున్న...

‘స‌లార్ 2’… రెడీ టూ షూట్‌!

ప్ర‌భాస్ మూడ్ మొత్తం సినిమాల‌పైనే ఉంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా, షూటింగులు చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ 'క‌ల్కి'తో బిజీగా ఉన్న ప్ర‌భాస్‌, ఆ త‌ర‌వాత 'రాజాసాబ్' కు కొన్ని డేట్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close