తెలంగాణలో ఒంటరి పోటీ – ఏపీలో పొత్తులు : చంద్రబాబు

బీజేపీతో అంతర్గతంగా ఏం చర్చిస్తున్నామో ఎవరికీ తెలియదని చంద్రబాబు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బీజేపీతో పొత్తుల అంశంపై సమయం మించిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీపై కమిటీ వేశామని.. ఆ కమిటీ అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పొత్తులు పెట్టుకునే ఆలోచనలో ఉందని చంద్రబాబు చెప్పారు. దేశ నిర్మాణంలో భాగం అవుతానని అది ఎలా అనేది కాలమే నిర్ణయిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

1980ల నుంచే టీడీపీ జాతీయ కూటమిల్లో భాగంగా ఉందని గుర్తు చేశారు. ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉందన్నారు. ఇండియా కూటమికి లీడర్ లేకపోవడం బీజేపీ కి అనుకూల అంశమని.. ఇండియా కూటమికి నాయకత్వం ఎవరు వహిస్తారు అనేదానిపై కామెంట్ చేయనని స్పష్టం చేశారు. రాజకీయ అనుభవం ఉన్నవాళ్లెవరూ మోడీని విమర్శించడం లేదని చంద్రబాబు గుర్తు చేశారు. మోడీ వయసు గురించి మాట్లాడే దమ్ము వైసీపీ వాళ్లకు ఉందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి పై నాకు ఉన్నంత సంతృప్తి ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. ఏపీ, తమిళనాడు లో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదని.. దక్షిణాది లో కాంగ్రెస్ ఉంది తెలంగాణ, కర్ణాటకలోనేనన్నా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. మోడీ భారత్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారున్నారు. వాజ్ పెయి,మన్మోహన్ సింగ్ అంతగా అంతర్జాతీయ పర్యటనలు చేయలేదని గుర్తు చేసారు.

రూ. 500, ఆపై కరెన్సీ నోట్లను రద్దు చేయాలని సూచించానని చంద్రబాబు గుర్తు చేశారు. అలా చేస్తే ఎన్నికల్లో నగదు పంపిణీ ఉండదు. మంచి ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేయాలని భావించానని.. మూడు రాజధానులు పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేశారని జగన్ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణం ఆగిపోయింది. పోలవరం పూర్తిచేసి నదులను అనుసంధానం చేస్తే ఉత్తమ రాష్ట్రంగా ఏపీ నిలిచేదన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్ ను గద్దెదించాలన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close