ఏపీలో పొలిటికల్ గాసిప్స్ షేర్ చేసినా సీఐడీ కేసులే..!

తెలుగు దేశం సోషల్ మీడియా కార్యకర్తలపై సీఐడీ కేసులు.. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ఇద్దరిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో నలంద కిషోర్ అనే వ్యక్తిని…కృష్ణా జిల్లాలో చిరుమామిళ్ల కృష్ణ అనే యువకుడ్ని పోలీసులు అర్థరాత్రి పూట అరెస్ట్ చేశారు. వీరు చేసిన తప్పేమిటంటే.. కొన్ని వెబ్‌సైట్లలో హీరోలకు.. హీరోయిన్లకు..దర్శకులకు..నిర్మాతలకు లింక్ పెడుతూ వచ్చే సినిమా తరహా గాసిప్స్ ను… పొలిటికల్ గా మిక్స్ చేసి.. వస్తున్న పోస్టులను షేర్ చేయడం. అందులో ఏముందో కానీ… వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాటిలో ఎవరి పేర్లూ లేవు. కానీ ఎవరిని ఉద్దేశించి అన్నారో రాజకీయ జ్ఞానం ఉన్నవారికి అర్థమైపోతుంది.

ఆ గాసిప్స్ విజయసాయిరెడ్డి, అవంతికి సంబంధించినవి.. వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఐడీ పోలీసులు కృష్ణ,కిషోర్‌లను విడివిడిగా అర్థరాత్రి అరెస్ట్ చేశారు. వీరికి మూడు రోజుల ముందుగానే నోటీసులు ఇచ్చారు. విచారణ కూడా చేశారు. అయినప్పటికీ… మళ్లీ అర్థరాత్రి పూట హడావుడిగా అరెస్ట్ చేశారు. విశాఖలో అరెస్ట్ చేసిన నలంద కిషోర్ అనే వ్యక్తికి 70 ఏళ్లు ఉంటాయి. ఆయన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అనుచరుడు. ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసి గంటా శ్రీనివసరావు సీఐడీ ఆఫీసు వద్దకు వెళ్లారు. కానీ విచారణ జరుగుతోందని.. ఆయనను లోపలికి అనుమతించలేదు. నలంద కిషోర్ దేశద్రోహం ఏమీ చేయలేదని..గంటా శ్రీనివాసరావు పోలీసుల తీరుపై మండిపడ్డారు.

మూడు రోజుల క్రితమే సీఐడీ అధికారులకు వివరణ కూడా ఇచ్చారని…కిషోర్‌ పంపిన మెసేజ్‌లో ఎవరి పేర్లు కూడా లేవని గంటా స్పష్టం చేశారు. ప్రభుత్వానికి కోపం ఉంటే తనపై కక్ష తీర్చుకోవాలి కానీ.. అమాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని గంటా మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ తరపున యాక్టివ్‌గా సోషల్ మీడియాలో ఉంటున్న వారిని టార్గెట్ చేసి.. కేసులు పెడుతున్నారని..కొంత కాలంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారిని .. వారి కుటుంబాలను భయాందోళనలకు గురి చేసేలా.. అర్థరాత్రిపూట వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం వంటివి చేస్తున్నారని మండి పడుతున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా సీఐడీ పోలీసులు మాత్రం… ఒకే పద్దతిలోవెళ్తున్నారని.. మండిపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close